News February 12, 2025

చిన్నారి మృతి దురదృష్టకరం: మంత్రి

image

అల్లూరి జిల్లా తాడేపల్లిలో అన్నం తిన్న వెంటనే నులిపురుగుల మాత్రను వేయడంతో, గొంతులో అడ్డం పడి చిన్నారి మృతి చెందడం బాధాకరమని మంత్రి సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీవో సింహాచలంను ఆమె ఆదేశించారు. వైద్య సిబ్బంది పర్యవేక్షణ లేకుండా, సక్రమ పద్ధతిలో మాత్రలు వేయకపోవడమే కారణమని ప్రాథమిక విచారణలో ఆయన గుర్తించారు. అంగన్వాడీ టీచర్, ఆయా, సూపర్వైజర్లను సస్పెండ్ చేశారు.

Similar News

News September 13, 2025

మెదక్: తైబజార్ వసూళ్లు రద్దుకు ఆదేశం

image

మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మెదక్‌లో గిరిజన మహిళపై దురుసుగా ప్రవర్తించడం బాధాకరమని అన్నారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో తైబజార్ రద్దు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గిరిజన మహిళపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి పైన కేసు నమోదు చేయాలని డీఎస్పీకి సూచించారు.

News September 13, 2025

భద్రాచలం: గోదావరి పుష్కరాలు.. CM కీలక నిర్ణయం..!

image

2026లో జరగబోయే గోదావరి పుష్కరాలపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న పుణ్యక్షేత్రాల వద్ద టెంపుల్ సెంట్రిక్ ఘాట్‌లను నిర్మించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. సుమారు రెండు లక్షల మంది భక్తులు ఒకేసారి స్నానాలు చేసేందుకు వీలుగా శాశ్వత ఘాట్‌లను నిర్మించాలన్నారు.

News September 13, 2025

నేడు విజయనగరం కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ

image

విజయనగరం జిల్లా కొత్త కలెక్టర్‌గా నియమితులైన ఎస్.రామసుందర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో అధికారికంగా బాధ్యతలు చేపడతారు. ఇప్పటివరకు ఆయన రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కమిషనర్‌గా, సీడీఏ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. పూర్వ కలెక్టర్ అంబేడ్క‌ర్‌కు బదిలీ కాగా ఇంకా పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.