News February 3, 2025
చిన్నారులను చిత్రహింసల ఘటనలో మారు తండ్రి అరెస్ట్

జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇద్దరు చిన్నారులను చిత్రహింసలు పెట్టిన మారు తండ్రి గానాల పవన్ కుమార్‌ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లోజరిగిన డిఎస్పీ మాట్లాడుతూ చిన్నారులను బాధ పెడితే చట్టపరంగా శిక్షిస్తామన్నారు. సీఐ, ఎస్‌ఐ, ఐడీ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 17, 2026
బాపట్ల: 40.20 లక్షల విలువైన ఫోన్లు రికవరీ

జిల్లాలో ఫిబ్రవరి నెలలో 40.20 లక్షల విలువైన 201 ఫోన్లు రికవరీ చేసినట్లు బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ చెప్పారు. ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నేరుగా ఆయన ఫోన్లను అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు 806 మొబైల్ ఫోన్లు ట్రేస్ చేసి రికవరీ చేశామన్నారు. ప్రజలు తమ విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
News March 17, 2026
కడప: రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం

కడప జిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ పాలకవర్గ సభ్యుల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు కొనసాగనున్నాయి. కడప నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా జిల్లా జేసీ నిధి మీనా బాధ్యతలు చేపట్టనున్నారు.
News March 17, 2026
మా కూతురు పెళ్లి లవ్ జిహాదే.. మోనాలిసా పేరెంట్స్ ఫిర్యాదు

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా పెళ్లి <<19360382>>లవ్ జిహాదే<<>> అంటూ ఆమె తల్లిదండ్రులు మండలేశ్వర్ (MP) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తి నటన పేరుతో తమ కూతురిని ప్రలోభపెట్టి పెళ్లి చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు కూతురు తిరిగి రాకుంటే తాను చనిపోతానని మోనాలిసా తల్లి గుండెలు బాదుకుంటోంది.


