News March 17, 2025

చిన్నారులూ.. పరీక్షలు ప్రశాంతంగా రాయండి: కలెక్టర్

image

చిన్నారులు.. 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా రాయాలని అన్నమయ్య కలెక్టర్ శ్రీధర్ చామకూరి పిలుపునిచ్చారు. పరీక్షలు ప్రారంభం అవుతున్న దృష్ట్యా అన్నమయ్య జిల్లాలోని విద్యార్థులకు స్ఫూర్తిని కల్పిస్తూ కలెక్టర్ మాట్లాడారు. పరీక్షలు బాగా రాయాలని, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటూ ‘మీ అందరికీ నా ఆశీస్సులు’ అన్నారు.

Similar News

News November 28, 2025

NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>NABARD<<>>లో 91పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, PG, MBA/PGDM, CA/CS/CMA/ICWA, PhD, BBA, BMS, BE, B.Tech, LLB/LLM ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ DEC 20న, మెయిన్స్ JAN 25న నిర్వహిస్తారు. ఆసక్తిగల SC/ST/OBC/PWBDలకు DEC 8 – DEC 19 వరకు ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ ఇస్తారు.

News November 28, 2025

సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

image

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.

News November 28, 2025

వనపర్తి: నామినేషన్‌కు ముందు కొత్త ఖాతా తప్పనిసరి: శ్రీనివాసులు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసే అభ్యర్థులు తమ పేరు మీద కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవాలని, ఎన్నికల వ్యయం మొత్తాన్ని దీని ద్వారానే చేయాలని వ్యయ పరిశీలకులు శ్రీనివాసులు తెలిపారు. నామినేషన్ సమయంలో ఇచ్చే ఎక్స్‌పెండీచర్ బుక్‌లో ప్రతి ఖర్చును నమోదు చేయాలని సూచించారు. 15 రోజులకు ఒకసారి ఆ వివరాలను నోడల్‌ అధికారికి చూపించి సంతకం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు.