News February 19, 2025
చిన్న కొత్తపల్లి మాజీ కార్యదర్శి సస్పెన్షన్

బాపట్ల జిల్లా అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా గతంలో పనిచేసిన ఈశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో చిన కొత్తపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల అవకతవకల విషయంలో పంచాయతీ కార్యదర్శి ఈశ్వర్‌ను సస్పెండ్ చేస్తూ.. బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈశ్వర్ రెడ్డి సంతమాగులూరు మండలం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
Similar News
News December 22, 2025
కంగ్టి: భర్త ఆటో డ్రైవర్.. భార్య సర్పంచ్

కంగ్టి మండలం ముర్కుంజాల్ సర్పంచిగా సారంగి అనూష లాల్ కుమార్ ఎన్నికయ్యారు. ఎస్సీ మహిళా రిజర్వేషన్ కేటాయించడంతో, బరిలోకి దిగిన ఆమె ఘన విజయం సాధించారు. అనూష భర్త లాల్ కుమార్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తమపై నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎల్లవేళలా అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి, ప్రజల సేవకు అంకితమవుతానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.
News December 22, 2025
FLASH.. నకిరేకల్‌లో మర్డర్

నకిరేకల్‌లో తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. తిప్పర్తి రోడ్డులో నివాసముండే ఎలగందుల వెంకన్న అనే కోడిగుడ్ల వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హతమార్చారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
News December 22, 2025
బిగ్ బాస్ విన్నర్ మన ఉత్తరాంధ్ర కుర్రాడే..!

ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్‌లో కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇతనిది భోగాపురం మండలం సుందరపేట. భారత ఆర్మీలో పని చేసిన కళ్యాణ్, బిగ్ బాస్ షోలో కామనర్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల ఆదరణ పొంది విజేతగా నిలిచారు. కాగా కళ్యాణ్ తల్లిదండ్రులు పాన్‌షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. సాధారణ కుటుంబానికి చెందిన కళ్యాణ్ విజేతగా నిలవడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


