News February 14, 2025

చిన్న క్రాకలో ఎమ్మెల్యే కాకర్ల ఫ్లెక్సీ చించివేత

image

జలదంకి మండలం చిన్న క్రాకలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ ఫోటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు గత రాత్రి చించివేశారు. చిన్న క్రాకలో ఓ చెరువు వద్ద ఒక వర్గం ఎమ్మెల్యే ఆయన సోదరుడు ఫోటోలతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఫ్లెక్సీలు చించివేయడంతో రాజకీయంగా దుమారం లేపింది. 

Similar News

News December 11, 2025

ఇందుకూరుపేట సీసీ గుండెపోటుతో మృతి

image

ఇందుకూరుపేట మండలం వెలుగు కార్యాలయంలో సీసీగా విధులు నిర్వహిస్తున్న ముదువర్తి శీనమ్మ (36) గుండుపోటుతో మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున గుండెల్లో నొప్పి అంటూ స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ఏరియా హాస్పిటల్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.

News December 11, 2025

నెల్లూరు మేయర్ పదవి.. రంగంలోకి కీలక YCP నేత.?

image

నెల్లూరు మేయర్ స్రవంతిని గద్దె దించేందుకు కూటమి నేతలు చేస్తోన్న ప్రయత్నాలను తిప్పి కొట్టేందుకు YCP గట్టిగా ప్రయత్నిస్తోందట. ఓ మాజీ మంత్రి అతని అనుచరగణంతో కార్పొరేటర్లను లొంగదీసుకునేందుకు సిద్ధమయ్యారట. మాటలకు లొంగితే ఓకే.. లేకుంటే డబ్బుతో కొనడమా అన్న ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లను బెదిరించినట్లు సమాచారం. ఎవరి ప్రయత్నాలు ఎంత వరకు సఫలీకృతం అవుతాయో చూడాల్సి ఉంది.

News December 11, 2025

నెల్లూరు: శిక్షణ పూర్తయినా.. తప్పని నిరీక్షణ.?

image

మహిళల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం కుట్టు మిషన్ల శిక్షణ చేపట్టింది. 3 నెలల పాటు ఈ శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందిస్తామన్నారు. శిక్షణ పూర్తయి 3నెలలు అయినా మిషన్లు అందలేదు. మహిళలు 3 నెలల నుంచి కుట్టు మిషన్లు, ధ్రువ పత్రాలు కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లాలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 31 శిక్షణా కేంద్రాల్లో 1808 మందికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి అయిన వారికి మిషన్లు అందించాలని మహిళలు కోరుతున్నారు.