News February 27, 2025
చిన్న మెట్పల్లిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

కోరుట్ల మండలం చిన్న మెట్పల్లి గ్రామానికి చెందిన మోత్కూరు సంజయ్ అనే విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సంజయ్ చదువులో వెనక పడటంతో పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 27, 2025
‘కూలీ’లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ‘కూలీ’ సినిమాలో స్టార్ నటి పూజా హెగ్డే జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం ఆమెను తీసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా, శివ కార్తికేయన్, నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో ‘కూలీ’పై అంచనాలు భారీగా పెరిగాయి.
News February 27, 2025
సిరిసిల్ల: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు

జిల్లావ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నట్టు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు. సిరిసిల్లలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు పూర్తయ్యే వరకు 163 BNSS యాక్ట్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని ఆయన కోరారు.
News February 27, 2025
స్కీముల కోసం ఆలయాలను డబ్బు అడిగిన ప్రభుత్వం

సుఖ్ అభయ్ స్కీముకు ఆలయాలు నిధులు అందించాలంటూ హిమాచల్ ప్రదేశ్ జిల్లా యూనిట్లు కోరడం వివాదాస్పదంగా మారింది. OPS, ఫ్రీబీస్ సహా అప్పుల పాలవ్వడంతో అక్కడి ఖజానా ఒట్టిపోయింది. నిధుల కొరత వల్ల తమ పరిధిలోని 35 మందిరాల నుంచి డబ్బులు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే ఆలయాల డబ్బులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శిస్తూ BJP ఆందోళనకు దిగడంతో CM సుఖ్వీందర్ సింగ్కు ఏం చేయాలో తోచడం లేదు. మీ కామెంట్?