News March 26, 2025
చిన్న మేరంగి జంక్షన్ వద్ద ఏనుగుల బీభత్సం

పార్వతీపురం మన్యం జిల్లా జీఎంవలస చిన్నమేరంగి జంక్షన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చిన్న మేరంగి జంక్షన్ కూరగాయల మార్కెట్ ఉన్న షాపులు గజరాజులు ధ్వంసం చేశాయి. కూరగాయలన్నీ నేలమట్టం అవడంతో షాపు యజమాని కన్నీరుమున్నీరుగా విలపించారు. ధ్వంసమైన షాపులకు నష్టపరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Similar News
News November 22, 2025
రేపు రాష్ట్ర పండుగగా పుట్టపర్తి సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలు

రాష్ట్ర పండుగగా పుట్టపర్తి సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం తెలిపారు. ఆదివారం సత్యసాయిబాబా జన్మదిన వేడుకను అధికారికంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, కలెక్టరేట్ వద్ద సత్య సాయిబాబా జన్మదిన వేడుకలు నిర్వహించాలన్నారు.
News November 22, 2025
‘స్వయం సహాయక గ్రూపుల్లో కిశోర బాలికలకు అవకాశం’

స్వయం సహాయక గ్రూపుల్లో 15- 18 ఏళ్ల వయసున్న కిశోర బాలికలకు అవకాశం కల్పిస్తామని, 60 ఏళ్లు దాటిన మహిళలకూ సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తామని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. బోయినిపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో కొత్తగా 5,560 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో చేరారని వివరించారు.
News November 22, 2025
‘టూరిజం స్పాట్‌గా దేవనూరు గుట్టల అభివృద్ధి’

దేవనూరు గుట్టలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. శనివారం ఉనికిచర్లలో ఆయన మాట్లాడుతూ… పట్టణ ప్రాంత ప్రజలు సెలవుల్లో సేదతీరేందుకు వీలుగా, ఈ ప్రాంతంలో ఆక్సిజన్ పార్కులు, ట్రెక్కింగ్ మార్గాలు, రాత్రి బస చేసేందుకు రిసార్ట్ వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని కడియం స్పష్టం చేశారు.


