News March 26, 2025

చిన్న మేరంగి జంక్షన్ వద్ద ఏనుగుల బీభత్సం

image

పార్వతీపురం మన్యం జిల్లా జీఎంవలస చిన్నమేరంగి జంక్షన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చిన్న మేరంగి జంక్షన్ కూరగాయల మార్కెట్‌ ఉన్న షాపులు గజరాజులు ధ్వంసం చేశాయి. కూరగాయలన్నీ నేలమట్టం అవడంతో షాపు యజమాని కన్నీరుమున్నీరుగా విలపించారు. ధ్వంసమైన షాపులకు నష్టపరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Similar News

News April 25, 2025

ఏప్రిల్ 25: చరిత్రలో ఈరోజు

image

✒ 1874: రేడియోను కనిపెట్టిన శాస్త్రవేత్త గూగ్లిల్మో మార్కోని జననం
✒ 1984: గణితశాస్త్రజ్ఞుడు ముదిగొండ విశ్వనాథం మరణం
✒ 2005: ఆధ్యాత్మిక గురువు స్వామి రంగనాథానంద మరణం(ఫొటోలో)
✒ 2005: గాయని, నటి టంగుటూరి సూర్యకుమారి మరణం
✒ 2018: రాజకీయ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి మరణం
✒ నేడు మలేరియా దినోత్సవం

News April 25, 2025

ఖమ్మం మిర్చి నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్.!

image

ఖమ్మంలో పండించే తేజ మిర్చికి అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. ఇతర రకాలతో పోలిస్తే ఖమ్మం తేజ మిర్చి ఘాటు ఎక్కువ కావడంతో ఇక్కడి నుంచే కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి పౌడర్, నూనెను విదేశాల్లో భారీగా ఉపయోగించడం వల్ల డిమాండ్ పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. అటు మార్కెట్‌లోనూ మిర్చి పోటెత్తుతోంది. కానీ ధరలు మాత్రం పెరగడం లేదని, ఉన్నతాధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

News April 25, 2025

పరీక్ష కేంద్రాల వద్ద భారీ భద్రత: ఖమ్మం సీపీ

image

ఖమ్మం జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశాల కామన్ ప్రవేశ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 6వ నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలకు ఈనెల 27న పరీక్ష జరుగనున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

error: Content is protected !!