News March 5, 2025

చిన్న వయసులోనే 175 సర్టిఫికెట్ కోర్సులు

image

కోనెంపాలెంకు చెందిన బండారు ప్రవల్లిక భీమిలి మండలం గొల్లలపాలెం KGBVలో 10వ తరగతి చదువుతుంది. ఈమె చిన్న వయసులోనే 175 సర్టిఫికెట్ కోర్సులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్ఫోసిస్ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫారంలో హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, ఎలక్ట్రానిక్స్,ఏఐ వంటి వివిధ సర్టిఫికెట్ కోర్సులు చేసిందని ప్రిన్సిపల్ గంగాకుమారి తెలిపారు. ఛైర్మన్ చందపరపు కుమార్, ఇతర సిబ్బంది చిన్నారిని అభినందించారు.

Similar News

News November 4, 2025

విశాఖ: గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

image

సీతానగరంలో నివాసం ఉండే రూపక్ సాయి ఒడిశా యువకులతో 2 రోజుల క్రితం గంగవరం సాగర్ తీరం మాధవస్వామి గుడి వద్దకు వెళ్లాడు. అక్కడ సముద్రంలో కెరటాల ఉద్ధృతికి గల్లంతైన విషయం తెలిసిందే. న్యూ పోర్ట్ పోలీసులు గాలింపు చేపట్టినా లభ్యం కాలేదు. మంగళవారం ఉదయం మాధవస్వామి గుడి సమీపంలోనే మృతదేహం ఒడ్డుకు రావడంతో పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

News November 4, 2025

విశాఖలో ముమ్మరంగా ఏర్పాట్లు

image

ఈనెల 14,15వ తేదీల్లో జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచస్థాయి భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్లను క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ మంగళవారం పరిశీలించారు. ఏయూ ఇంజినీరింగ్ క‌ళాశాల‌ మైదానంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను జేసీ మ‌యూర్ అశోక్‌తో క‌లిసి ప‌రిశీలించి పలు సూచ‌న‌లు చేశారు. ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మానికి దేశ, విదేశాల నుంచి 3వేల మంది హాజ‌ర‌వుతార‌న్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

News November 4, 2025

ఎస్.కోట విలీనానికి ‘ఎస్’ అంటారా?

image

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఎస్.కోట నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధుల హామీ తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో విశాఖ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే విజయనగరం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. పలువురు రాజకీయ నేతలు, ప్రజా సంఘాల వారు మంత్రివర్గ ఉపసంఘానికి వినతులు సమర్పించారు. స్థానిక కూటమి నేతల ప్రపోజల్‌కు అధిష్ఠానం ‘ఎస్’ అంటుందో ‘నో’ అంటుందో చూడాలి.