News March 19, 2025
చిన్న శ్రీను కుమారుడి మృతి

విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు రెండో కుమారుడు ప్రణీత్ నేడు మృతి చెందారు. 2020లో ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్ 4 సంవత్సరాల 10 నెలల పాటు మృత్యువుతో పోరాడాడు. చివరకు విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు.
Similar News
News November 16, 2025
యలమంచిలి: ‘పారిశ్రామిక వేత్తలు వస్తుంటే జగన్ ఓర్వలేక పోతున్నారు’

రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తల, పరిశ్రమలు క్యూ కడుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెంలో రూ. 55 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వైసీపీ పాలనలో అభివృద్ధి సంక్షేమాన్ని గాలికి వదిలేసిన నాయకులకు ప్రజల వద్దకు వచ్చి మాట్లాడే హక్కు లేదని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
News November 16, 2025
శ్రీసిటీలో రూ.31,450 కోట్ల పెట్టుబడులు

విశాఖ భాగస్వామ్య సదస్సులో శ్రీసిటీకి భారీ పెట్టుబడులు లభించాయి. సీఎం చంద్రబాబు 5 పరిశ్రమలను ప్రారంభించి, 12 కంపెనీలతో ఎంఓయూలను కుదిర్చారు. మొత్తం రూ.31,450 కోట్ల పెట్టుబడులతో 1.1 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. శ్రీసిటీని ‘బెస్ట్ ఇండస్ట్రియల్ మోడల్’గా సీఎం ప్రశంసించారు. 50 దేశాలు–500 కంపెనీల లక్ష్యంతో 2,500 ఎకరాలు కేటాయించినట్టు ప్రకటించారు.
News November 16, 2025
HYD: స్మార్ట్ఫోన్ అతి వినియోగం.. సమస్యలు ఇవే!

స్మార్ట్ఫోన్ను అతిగా ఉపయోగించడం వల్ల తీవ్రమైన భుజం, మెడ, వెన్నునొప్పి కేసులు పెరుగుతున్నాయని NIMS వైద్యులు చెబుతున్నారు. చిన్న వయస్సులోనే స్పాండిలైటిస్ వంటి ఆరోగ్య సమస్యలు బయట పడుతున్నాయని హెచ్చరించారు. గంటల తరబడి ఫోన్లో తల వంచడం వలన నాడులు, కండరాలపై ఒత్తిడి పెరిగి దీర్ఘకాలిక నొప్పులు వస్తున్నాయని, ప్రతి 30 నిమిషాలకోసారి విరామం తీసుకోవడం మంచిదని సూచించారు.
SHARE IT


