News January 18, 2025
చిరంజీవి బీజేపీలో చేరట్లేదు: టీజీ వెంకటేశ్

మెగాస్టార్ చిరంజీవి బీజేపీలోకి వస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. కర్నూలులో శుక్రవారం ఆయన మాట్లాడారు. ‘చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కు ప్రధాని మోదీతో మంచి అనుబంధం ఉంది. బీజేపీ పెద్దలతో చిరంజీవి స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తున్నారు. అంత మాత్రాన పార్టీలో చేరుతారని ఎలా చెబుతారు. కొందరు పనిగట్టుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు
Similar News
News December 6, 2025
కర్నూలు స్మార్ట్ సిటీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి: కలెక్టర్

కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఏ.సిరి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్, సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వినియోగించి, నిరంతర తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్, రవాణా వ్యవస్థ, పార్కులు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు.
News December 6, 2025
కర్నూలు కలెక్టర్ నేతృత్వంలో పంటపై సమీక్ష.!

కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి వివిధ పంటల మార్కెటింగ్‌పై ట్రేడర్లతో సమీక్ష నిర్వహించారు. రైతులకు న్యాయమైన ధర లభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, వ్యవసాయ అధికారులతోపాటు అనుబంధ శాఖల అధికారులు ఉన్నారు.
News December 6, 2025
హోంగార్డుల సేవలు ప్రశంసనీయం: జిల్లా SP.!

పోలీసుశాఖలో హోంగార్డుల విధులు, సేవలు ఆదర్శప్రాయమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ అభినందించారు. శనివారం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పరేడ్‌ను పరిశీలించారు. హోంగార్డులు పోలీసులతో సమానంగా శాంతి భద్రతల పరిరక్షణలో ముందుంటారన్నారు.


