News October 16, 2024
చిరుత పులి సంచరిస్తుంది.. జాగ్రత్తగా ఉండండి: సీఐ ఇంద్రసేనారెడ్డి

ఏన్కూర్, జూలూరుపాడు మండల ప్రాంతాలలో చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారని సీఐ ఇంద్రసేనా రెడ్డి అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు, ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటికి వెళ్లకపోవడం మంచిదని చెప్పారు. చిరుత కనబడితే తమకు సమాచారం అందించాలని కోరారు.
Similar News
News January 3, 2026
ఖమ్మం ఆయుర్వేద ఆసుపత్రిలో మందులు నిల్!

ఖమ్మం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మందుల కొరతతో వెలవెలబోతోంది. మూడు నెలలుగా ఇక్కడ మందులు అందుబాటులో లేకపోవడంతో చికిత్స కోసం వచ్చే రోగులు రిక్తహస్తాలతో వెనుదిరుగుతున్నారు. పెద్ద సంఖ్యలో బాధితులు ఈ ఆసుపత్రిని ఆశ్రయిస్తుంటారు. వైద్యులు పరీక్షించి చీటీలు రాసిస్తున్నా, మందుల కౌంటర్లో నిల్వలు లేవని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మందుల సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
News January 3, 2026
ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి: అదనపు కలెక్టర్

రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై అదనపు కలెక్టర్ శ్రీజ జిల్లాలోని అందరు మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని, ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News January 3, 2026
ఖమ్మం: సర్వం సిద్ధం.. నేటి నుంచి టెట్ పరీక్షలు

ఖమ్మం నగరంలో టెట్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జరిగే పరీక్షలకు 9 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని తెలిపారు. ఉ.9 నుంచి 11 వరకు ఒక సెషన్, మ.2 నుంచి సా.4:30 వరకు మరో సెషన్ లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. కాగా పరీక్షలకు మొత్తం 20,547 మంది విద్యార్ధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.


