News December 22, 2024
చిరుత సంచారంపై ఫారెస్టు అధికారి ఆరా
పెద్దకడబూరులోని 76 కాలువ సమీపంలో పిల్లగుండ్లు పరిసర పొలాల్లో వారం రోజులుగా చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత సంచారానికి సంబంధించి దాని పాదాల జాడలు పొలాల్లో కనిపించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారి సమీవుల్లా చిరుత సంచారంపై పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి, చిరుత జాడలను పరిశీలించారు. చిరుత కనిపిస్తే సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు.
Similar News
News December 23, 2024
కర్నూలు: రైతు సొంత వైద్యం.. 30 గొర్రెలు మృతి
30 గొర్రెలు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలంలో జరిగింది. తిమ్మందొడ్డి గ్రామానికి చెందిన చిన్నకు సుమారు 600 గొర్రెలు ఉన్నాయి. వాటికి బలం వచ్చేందుకు వైద్యుల అనుమతి లేకుండానే సొంతంగా టానిక్ తాపారు. వికటించడంతో సుమారు 30 గొర్రెలు మృతిచెందాయి. టానిక్ అధిక డోసు ఇవ్వడంతోనే మృత్యువాతపడినట్లు పశువైద్యుల రిపోర్టులో తేలింది. భారీ నష్టం జరగడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
News December 23, 2024
పత్తికొండ గ్రామ చరిత్ర తెలుసా?
పత్తికొండలో పూర్వం ఒక గొర్రెల కాపరి అడవిలో గొర్రెలు మేపుతూ.. క్రమంగా అడవిని నరికి పత్తి పండించాడని రాజుల చరిత్ర తెలిసిన వారు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో పంటలు బాగా పండటంతో ఇతరులు వచ్చి పంటలు పండిస్తూ ఉండిపోయారట. ఇలా గ్రామంగా ఏర్పడిన తర్వాత విజయనగర యువ రాజు వేంకటరాజా ఈ గ్రామాన్ని సమీపంలోని కొండ ప్రాంతానికి తరలించాడని చరిత్ర. అందువల్ల ఈ గ్రామానికి పత్తికొండ అనే పేరు వచ్చిందని గ్రామస్థులు అంటున్నారు.
News December 23, 2024
నేడు కలెక్టరేట్‌లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ
నంద్యాల పట్టణం కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ హలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9:15 గంటలకు అధికారులు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.