News February 9, 2025
చిరుమల్ల వనదేవతల జాతరకు వేళాయే!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామంలో సమ్మక్క సారక్క జాతరకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర తేదీలను ప్రకటించింది. జాతర వివరాలిలా.. ఈనెల 11వ తేదీన జాతర ప్రారంభం కానుంది. 12న ఎదురుగుట్ట నుంచి పగిడిద్ద రాజును, 13న ముసలమ్మ గుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొచ్చి కళ్యాణం జరుపుతారు. 14న శంకుపండుగ, 15న చిరుమల్ల నుంచి ముసలమ్మ గుట్టకు సమ్మక్కను తీసుకెళ్లడంతో జాతర ముగుస్తుంది.
Similar News
News December 6, 2025
కృష్ణా: నకిలీ సిమ్లు.. మరో 8 మందికి సంకెళ్లు

వినియోగదారుల ఆధార్ వివరాలు, వేలిముద్రలతో అక్రమంగా సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్న సైబర్ మోసగాళ్ల ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు ముమ్మరం చేసి, తాజాగా మరో 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో కృష్ణా జిల్లా పెడన ప్రాంతానికి చెందిన ఐదుగురు ఉండగా, ఈ మోసాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
News December 6, 2025
VZM: రెస్ట్ కోసం కారు ఆపితే..!

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఉహించలేరు. విజయనగరం జిల్లాకు చెందిన పలువురు <<18484112>>స్వాములు<<>> అయ్యప్పకు ఇరుముడి సమర్పించారు. అనంతరం శబరిమల నుంచి కారులో తిరుగుపయనమయ్యారు. రాత్రి ప్రయాణం ప్రమాదమని భావించి రామేశ్వరం వద్ద రోడ్డు పక్కన వాహనం ఆపారు. అందరూ నిద్రలో ఉండగా మృత్యు లారీ కారు మీదకు దూసుకు రావడంతో నలుగురు చనిపోయారు. వీరి మరణ వార్త విన్న కుటుంబీకులు, గ్రామస్థులు విషాదంలో మునిగారు.
News December 6, 2025
నాగర్ కర్నూల్: అత్యల్పంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది. తుఫాన్ ప్రభావం వల్ల వారం రోజులపాటు చలి తీవ్రత తగ్గినప్పటికీ రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా చలి పెరిగింది. శనివారం వెల్దండలో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తోటపల్లి 14, కల్వకుర్తి 14.4, బిజినపల్లిలో 14.7 డిగ్రీలు నమోదయ్యాయి.


