News February 9, 2025
చిరుమల్ల వనదేవతల జాతరకు వేళాయే!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామంలో సమ్మక్క సారక్క జాతరకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర తేదీలను ప్రకటించింది. జాతర వివరాలిలా.. ఈనెల 11వ తేదీన జాతర ప్రారంభం కానుంది. 12న ఎదురుగుట్ట నుంచి పగిడిద్ద రాజును, 13న ముసలమ్మ గుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొచ్చి కళ్యాణం జరుపుతారు. 14న శంకుపండుగ, 15న చిరుమల్ల నుంచి ముసలమ్మ గుట్టకు సమ్మక్కను తీసుకెళ్లడంతో జాతర ముగుస్తుంది.
Similar News
News March 22, 2025
కర్నూలులో పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు ఇలా..!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
☞ ఉదయ 9.45 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు
☞ 9.50 గంటలకు రోడ్డు మార్గాన ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో నీటి కుంటల తవ్వకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు
☞ 11.40 గంటలకు తిరిగి విమానాశ్రయం చేసుకుని బేగంపేట వెళ్తారు.
News March 22, 2025
VZM: జాగ్రత్త.. తేదీలను చింపేసి మరీ అమ్మకాలు!

విజయనగరం జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాప్స్, ఏజెన్సీలపై విజిలెన్స్ తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో నివ్వెర పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ధనార్జనే ధ్యేయంగా కొంతమంది అక్రమార్కులు అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మత్తును కలిగించే ఔషధాలను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్నారు. వాటిపై ముద్రించిన తయారీ, ఎక్స్‌పైరీ తేదీలను చించి మరీ అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.
News March 22, 2025
గండేపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

గండేపల్లి మండలం మురారి గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. జాతీయ రహదారిని శుభ్రపరిచే వాహనాన్ని రాజమండ్రి నుంచి వస్తున్న లారీ ఢీకొంది. దీంతో రోడ్డుపై కోన్లు పెడుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. గండేపల్లి ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.