News February 10, 2025

చిరుమళ్ల జాతరకు పోదాం.. చలో.. చలో..

image

సమ్మక్క జన్మస్థలమైన చిరుమల్లలో జాతరకు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్లలో చందా వంశస్థులు ఇక్కడ జరుపుతారు. ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు ఈ నెల 11 నుంచి మొదలు కానున్నాయి. ఎదురుగుట్ట నుంచి పగిడిద్ద రాజును, ముసలమ్మ గుట్ట నుంచి సమ్మక్కను ఇక్కడికి తీసుకొచ్చి కళ్యాణం జరపడం ఈ జాతర ప్రత్యేకత. మేడారం జాతర అయిన మరుసటి ఏడాది ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు.

Similar News

News November 20, 2025

ఖమ్మం: పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలి

image

గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా తయారీపై గురువారం ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. HYD నుంచి జరిగిన ఈ సమీక్షలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్, అ.కలెక్టర్ శ్రీజ, తదితరులు పాల్గొన్నారు.

News November 20, 2025

ఖమ్మంలో 8 మిల్లులకు ధాన్యం ఇవ్వబోం: అ.కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి గురువారం సమావేశం నిర్వహించారు. నిబంధనలు పాటించే మిల్లర్లకే ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయింపులు ఉంటాయని తెలిపారు. జిల్లాలోని 71మిల్లుల్లో 63మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారంటీలు సమర్పించాయని, మిగిలిన 8మిల్లులకు ధాన్యం ఇవ్వబోమని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న యాసంగి రైస్ డెలివరీ పూర్తి చేసిన తర్వాతే కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

News November 20, 2025

ఖమ్మం: నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్

image

ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగులకు CCTV ఇన్స్టాలేషన్, బ్యూటీషియన్ ఉచిత శిక్షణ ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ శిక్షణలో వసతి, భోజన సౌకర్యాలు ఫ్రీగా కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.