News February 10, 2025
చిరుమళ్ల జాతరకు పోదాం.. చలో.. చలో..

సమ్మక్క జన్మస్థలమైన చిరుమల్లలో జాతరకు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్లలో చందా వంశస్థులు ఇక్కడ జరుపుతారు. ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు ఈ నెల 11 నుంచి మొదలు కానున్నాయి. ఎదురుగుట్ట నుంచి పగిడిద్ద రాజును, ముసలమ్మ గుట్ట నుంచి సమ్మక్కను ఇక్కడికి తీసుకొచ్చి కళ్యాణం జరపడం ఈ జాతర ప్రత్యేకత. మేడారం జాతర అయిన మరుసటి ఏడాది ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు.
Similar News
News March 16, 2025
రాజీవ్ యువ వికాసంపై Dy.CM భట్టి సమీక్ష

ప్రజా భవన్‌లో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలు, కావలిసిన నిధులపై చర్చించారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్లు ప్రీతం, బెల్లయ్య నాయక్, ఒబేదుల్లా కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు.
News March 16, 2025
ఖమ్మం: అనుమానాస్పదంగా వివాహిత ఆత్మహత్య

ఓ వివాహిత తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని ఆళ్లపాడుకు చెందిన షేక్ మస్తాన్, జరీనా(28) దంపతులు. జరీనా అప్పటి వరకు ఇంట్లో పని చేసుకుంటుండగా, విశ్రాంతి తీసుకోడానికి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కొంత సమయం తర్వాత ఇంట్లో వాళ్లు చూడగా, ఉరి వేసుకొని ఉంది. ఎస్ఐ మధుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 16, 2025
ఇందిరమ్మ ప్రభుత్వంలో విద్య, వైద్యానికి పెద్ద పీట: పొంగులేటి

ఇందిరమ్మ ప్రభుత్వంలో విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. 58 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి రూ.200కోట్ల చొప్పున మొత్తం 11,600కోట్లను కేటాయించుకోని ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని తెలిపారు.