News February 10, 2025
చిరుమళ్ల జాతరకు పోదాం.. చలో.. చలో..

సమ్మక్క జన్మస్థలమైన చిరుమల్లలో జాతరకు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్లలో చందా వంశస్థులు ఇక్కడ జరుపుతారు. ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు ఈ నెల 11 నుంచి మొదలు కానున్నాయి. ఎదురుగుట్ట నుంచి పగిడిద్ద రాజును, ముసలమ్మ గుట్ట నుంచి సమ్మక్కను ఇక్కడికి తీసుకొచ్చి కళ్యాణం జరపడం ఈ జాతర ప్రత్యేకత. మేడారం జాతర అయిన మరుసటి ఏడాది ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు.
Similar News
News March 22, 2025
MBNR: రాజీవ్ యువ వికాసం.. APPLY చేసుకోండి..!

ఉమ్మడి పాలమూరు జిల్లా అర్హులైన బీసీ నిరుద్యోగ యువత “రాజీవ్ యువ వికాసం పథకం”ను ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 5లోగా దరఖాస్తులు చేసుకోవాలని బీసీ అభివృద్ధి శాఖ అధికారిణి ఇందిర ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా ఉపాధి రుణాలు పొందవచ్చని, ఎంపికైన అభ్యర్థులకు జూన్ 2న ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తోందన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. SHARE IT
News March 22, 2025
విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు

ఇతర దేశాల్లోని వివిధ యూనివర్సిటీల్లో చదవాలని అనుకునే వారి కోసం ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నట్లు శౌర్య కన్సల్టెన్సీ తెలిపింది. ఇందుకోసం JNTU బ్రాంచీలో ఈ నెల 22, 23 తేదీల్లో యూనివర్సిటీ, బ్యాంకు అధికారులు అందుబాటులో ఉంటారని ప్రకటించింది. విద్యార్థులు ఎవాల్యుయేషన్, స్కాలర్‌షిప్ గైడెన్స్, ఇతర వివరాల కోసం ఆయా తేదీల్లో సంప్రదించాలని సూచించారు.
News March 22, 2025
ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం

డీలిమిటేషన్‌పై చెన్నైలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేరళ సీఎం విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పంజాబ్ సీఎం మాన్ తదితరులు హాజరయ్యారు. వారిని స్టాలిన్ సత్కరించారు. సమావేశానికి బెంగాల్ సీఎం మమత గైర్హాజరయ్యారు.