News January 3, 2025

చిలకలూరిపేటలో గొంతు కోసి దారుణ హత్య

image

చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. సుభాని నగర్‌కు చెందిన పాలపర్తి నాగరాజును(50) గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఆయనకు ఒక బాబు, పాప ఉన్నారు. డైక్ మెన్ కాలనీకి చెందిన ఆకుల చెన్నయ్య తానే హత్య చేసినట్లు పోలీసులకు లొంగిపోయారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య సంఘటన జరిగినట్లు చెబుతున్నారు.

Similar News

News January 17, 2025

అధికారులకు గుంటూరు కలెక్టర్ ఆదేశాలు జారీ

image

స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను అధికారులు సమన్వయంతో చేపట్టాలని గుంటూరు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ అధికారులకు సూచించారు. గురువారం కలక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై ప్రాధమిక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై శకటాలు రూపొందించి పరేడ్‌లో ప్రదర్శించాలన్నారు.

News January 16, 2025

మహిళా పోలీసులు ఒక వారధి: జిల్లా ఎస్పీ 

image

క్షేత్ర స్థాయిలో ప్రజలకు, పోలీస్ శాఖకు మధ్య మహిళా పోలీసులు ఒక వారధి లాంటి వారని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ అన్నారు. గురువారం గుంటూరు జిల్లాకు చెందిన గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు (మహిళా పోలీసులకు) దైనందిన విధులకు సంబంధించి జాబు చార్టు యాప్ ను ఎస్పీ ఆవిష్కరించారు. జాబు చార్టు యాప్‌తో జవాబుదారితనం ఏర్పడి సమర్ధవంతంగా విధులు నిర్వర్తించే అవకాశం ఏర్పడిందన్నారు.

News January 16, 2025

గుంటూరు: పీఎం ఇంటర్న్‌షిప్‌ పోస్టర్ల ఆవిష్కరణ

image

యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పీఎం ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం ప్రారంభించిందని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. కలెక్టరేట్లో ఈ పథకం సంబంధించిన వాల్ పోస్టర్లను జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావుతో కలిసి ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులన్నారు. https://mca.gov.in/login/లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.