News April 14, 2025
చిలకలూరిపేటలో లారీ ఢీకొని వ్యక్తి మృతి

చిలకలూరిపేట మండలంలోని మద్దిరాల వద్ద లారీని ఢీకొని వ్యక్తి సోమవారం మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఒంగోలుకు చెందిన షేక్ అబ్దుల్లా(45) షేక్ సాఫాను 2వ వివాహం చేసుకొని మద్దిరాలలో ఉంటున్నాడు. బైక్‌పై వెళుతున్న వ్యక్తిని చిలకలూరిపేట వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో హాస్పిటల్‌కి తీసుకువెళ్లగా చనిపోయాడని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అనిల్ తెలిపారు.
Similar News
News November 25, 2025
ధాన్యం కొనుగోలుపై ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని ప.గో జాయింట్ కలెక్టర్ రాహుల్ సూచించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొనుగోలు, రవాణా, తూకంలో సమస్యలుంటే 81216 76653, 1800 425 1291 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. కొనుగోళ్లకు రైతు సేవా కేంద్రాలను సిద్ధం చేశామని, రైతులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
News November 25, 2025
జగిత్యాల: ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ పెంపుపై కలెక్టర్ సమీక్ష

2025–26 ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ల పెంపుపై కలెక్టర్ బి.సత్యప్రసాద్ మంగళవారం సమావేశం నిర్వహించారు. 5–8 ప్రభుత్వ, 9–10 ప్రభుత్వ–ప్రైవేట్ పాఠశాలల SC విద్యార్థులు tgepass.cgg.gov.inలో దరఖాస్తు చేయాలని సూచించారు. ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాలు, కుల–ఆదాయం సర్టిఫికెట్ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. ఇన్ఆపరేటివ్ ఖాతాలున్న వారికి పోస్టల్ అకౌంట్లు తెరిపించి 100% రిజిస్ట్రేషన్ చేయాలన్నారు.
News November 25, 2025
అండర్-19 క్రికెట్ పోటీల్లో పినపాక విద్యార్థిని సత్తా

సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ఎస్.జీ.ఎఫ్ అండర్-19 రాష్ట్ర స్థాయి బాలికల క్రికెట్ పోటీల్లో పినపాక మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని వైష్ణవి రత్న ప్రతిభ కనబరిచింది. కరీంనగర్‌పై 17 బంతుల్లో 32 పరుగులు, వరంగల్‌పై 40 బంతుల్లో 46 పరుగులు చేసి, 2 వికెట్లు తీసింది. మహబూబ్‌నగర్‌పై కూడా 2 వికెట్లు సాధించి జట్టు విజయానికి కీలకంగా నిలిచింది. వైష్ణవికి పలువురు అభినందనలు తెలిపారు.


