News May 25, 2024
చిలకలూరిపేట: ఓగేరు వాగులో పడి ఇద్దరు మృతి

చిలకలూరిపేట మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. మండలంలోని మద్దిరాల గ్రామంలోని ఓగేరు వాగులో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీశారు. మృతులు గ్రామానికి చెందిన పరిచూరి శ్రీనివాసరావు(50), వరగాని వెంకట్రావు(40)గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 10, 2025
గుంటూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో 0863-2241029 తో కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నాగలక్ష్మీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 24 గంటలూ కంట్రోల్ రూమ్ సేవలు అందిస్తుందని అన్నారు. ఎన్నికల పై ఫిర్యాదు చేయడంతో పాటూ ఇతర సమాచారాన్ని తెలుసుకోవడానికి కంట్రోల్ రూమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News February 9, 2025
ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

ముప్పాళ్లలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి గంగమ్మ, సామ్రాజ్యం, మాధవి, పద్మ అనే నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం భరోసానిచ్చారు.
News February 9, 2025
గుంటూరు ప్రజలకు SP సతీశ్ సూచన

గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)ని రద్దు చేయడం జరిగిందని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. తదుపరి జరిగే పీజీఆర్ఎస్ వివరాలను తిరిగి ప్రకటిస్తామని చెప్పారు.