News April 8, 2025
చిలకలూరిపేట: గ్రానైట్ ఫ్యాక్టరీ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

చిలకలూరిపేట మండలం మురికిపూడిలో గ్రానైట్ ఫ్యాక్టరీని సోమవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాత గ్రానైట్ ప్రకాశం జిల్లా నుంచి ఎగుమతి అవుతుంది. చిన్న, మధ్య, పెద్ద పారిశ్రామికవేత్తలకు AP అనుకూలం ప్రాంతమన్నారు. అన్ని రంగాల పారిశ్రామిక వేత్తలను సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని మంత్రి రవికుమార్ అన్నారు.
Similar News
News April 21, 2025
ఒకేసారి APPSC, DSC పరీక్షలు.. అభ్యర్థుల్లో ఆందోళన

AP: మెగా డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు జరగనుండగా అదే సమయంలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. దీంతో రెండింటికీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జూన్ 16 నుంచి 26 వరకు పాలిటెక్నిక్, జూ.లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల భర్తీకి పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా తేదీల్లో మార్పు చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.
News April 21, 2025
ASF: తల్లి, భార్య మందలించిందని సూసైడ్

మద్యం తాగొద్దని తల్లి, భార్య మందలించడంతో వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వాంకిడి మండలంలో చోటు చేసుకుంది. వాంకిడి ఎస్సై ప్రశాంత్ కథనం ప్రకారం.. ఇందాని గ్రామానికి చెందిన లచ్చుంబాయి చిన్న కుమారుడు సంతోశ్ మద్యానికి బానిసయ్యాడు. తల్లి, భార్య కల్పన మందలించడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 21, 2025
వరంగల్: మూడు జిల్లాల్లో విస్తరించిన ‘పాకాల’

పాకాల అభయారణ్యం అంటే ఒక్క వరంగల్ జిల్లానే అనుకుంటారు. నిజానికి పాకాల అడవి 839చ.కి.మీ విస్తీర్ణంతో వరంగల్‌తో పాటు మహబూబాబాద్, ములుగు జిల్లాలోనూ విస్తరించి ఉంది. వివిధ రకాల జంతువులు, పక్షులు, సరీసృపాలకు అనువైనదిగా ఉంది. శీతాకాలంలో విదేశీ పక్షులు సైతం ఇక్కడ సందడి చేస్తాయి. నర్సంపేటకు 9 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాకాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సందర్శకులు వస్తుంటారు.