News January 30, 2025
చిలకలూరిపేట: చిన్నారిపై లైంగిక దాడికి యత్నం

చిలకలూరిపేటలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివరాల మేరకు.. ఈ నెల 26వ తేదీన చిలకలూరిపేట మండలంలోని ఓ గ్రామంలో ఆరేళ్ల బాలికపై గోవింద్ అనే యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. తోటి పిల్లలు అది గమనించి చుట్టుపక్కల వారికి చెప్పారు. దీంతో యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 21, 2025
భార్యకు దూరంగా సెహ్వాగ్!

మాజీ క్రికెటర్ సెహ్వాగ్ చేసిన దీపావళి పోస్టులో భార్య కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తల్లి, పిల్లలతో ఉన్న ఫొటోనే వీరూ షేర్ చేశారు. ఆయన భార్య ఆర్తి సైతం పిల్లలతో దిగిన ఫొటోనే పంచుకున్నారు. వీరిద్దరూ చాలా కాలంగా దూరంగా ఉంటున్నారని, సోషల్ మీడియాలో అన్ఫాలో చేసుకున్నారని నేషనల్ మీడియా తెలిపింది. దీంతో విడాకుల రూమర్స్ పెరిగాయి. సెహ్వాగ్ చివరిసారిగా 2023 ఆగస్టులో భార్యతో ఉన్న ఫొటోను షేర్ చేశారు.
News October 21, 2025
23న జాబ్ మేళా

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనకాపల్లిలోని కోటవురట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ నెల 23న జాబ్ మేళా జరగనుంది. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీలో పాసైన 18-35 ఏళ్ల యువకులు అర్హులు. 18 కంపెనీలలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో రావాలన్నారు. ముందుగా https://naipunyam.ap.gov.in/లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
News October 21, 2025
MBNR: 370 ఉద్యోగాలు.. సద్వినియోగం చేసుకోండి

MBNRలోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో (పిల్లలమర్రి) ఈనెల 23న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ Way2Newsతో తెలిపారు. 3 ప్రైవేట్ సంస్థలలో 370 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని, వయస్సు 18-30లోపు ఉండాలని, ఆధార్, సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ఉమ్మడి జిల్లా అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. SHARE IT.