News January 30, 2025

చిలకలూరిపేట: చిన్నారిపై లైంగిక దాడికి యత్నం

image

చిలకలూరిపేటలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివరాల మేరకు.. ఈ నెల 26వ తేదీన చిలకలూరిపేట మండలంలోని ఓ గ్రామంలో ఆరేళ్ల బాలికపై గోవింద్ అనే యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. తోటి పిల్లలు అది గమనించి చుట్టుపక్కల వారికి చెప్పారు. దీంతో యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 19, 2025

అదే మా పార్టీ ఆలోచన: KTR

image

తెలంగాణకు ఏనాటికైనా BRS పార్టీయే రక్షణ కవచం అని KTR అన్నారు. BRS విస్తృతస్థాయి సమావేశం అనంతరం మాట్లాడుతూ ‘KCR గారు ఒకటే మాట చెప్పారు. పార్టీలు ఓడిపోతుంటాయి. గెలుస్తుంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు, తెలంగాణ సమాజం గెలవాలి. అదే మా ఆలోచన’ అని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఫైరయ్యారు.

News February 19, 2025

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్

image

TG: 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ ఏడాది మే 7 నుంచి 31 వరకు పోటీలు కొనసాగనున్నాయి. ఓపెనింగ్, క్లోజింగ్ సెర్మనీ, గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీల్లో 120 దేశాల యువతులు అలరించనున్నారు. ఇందులో పాల్గొనే వారి వయసు 17 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదు. ఏ దేశంలో పుడితే ఆ దేశం నుంచి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి. విజేతకు వజ్రాల కిరీటం అందిస్తారు.

News February 19, 2025

BNGR: పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్‌కు ఫిర్యాదు

image

రాజాపేట మండలం పుట్టగూడెం కార్యదర్శి అవినీతికి పాల్పడుతున్నారని గ్రామస్థులు బుధవారం జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఇళ్ల కొలతలకు ఒక్కొక్కరి వద్ద రూ.10 వేల నుంచి రూ.12 వేలు వసూలు చేశారని, డిజిటల్ సర్వే పేరుతో మోసం చేశారని ఆరోపించారు. పొడవు, వెడల్పు కొలతలు వేయకుండా ప్రైవేటు సర్వేయర్‌తో కుమ్మక్కయ్యారన్నారు. వెంటనే విచారణ చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

error: Content is protected !!