News May 17, 2024

చిలకలూరిపేట: డీజిల్ ట్యాంకు పగలడం వల్లే మంటలు

image

చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాద స్థలిని అగ్నిమాపకశాఖ అధికారులు పరిశీలించారు. వేగంగా వచ్చిన బస్సు.. టిప్పర్ డీజిల్ ట్యాంకును ఢీకొట్టింది. దీంతో అందులోని ఆయిల్ బస్సు అంతటా పడటంతో మంటలు పెద్దఎత్తున చెలరేగాయని అగ్నిమాపకశాఖ అడిషనల్ డైరెక్టర్ తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం అయిన విషయం తెలిసిందే.

Similar News

News May 7, 2025

గుంటూరు జిల్లాలో భద్రతా తనిఖీలు 

image

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో డీజీపీ ఆదేశాల మేరకు శనివారం గుంటూరు జిల్లాలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ సతీశ్ కుమార్ నేతృత్వంలో బస్టాండ్‌లు, ఆటో స్టాండ్‌, మార్కెట్, రైల్వే స్టేషన్, లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. అనుమానితుల వేలిముద్రలు పరిశీలించారు. వాహనాల రిజిస్ట్రేషన్, సరుకు వివరాలను పరిశీలించారు. అనుమానితులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. 

News May 7, 2025

పది పరీక్షల సప్లిమెంటరీ ఫీజ్ చెల్లించండి: DEO

image

మే నెలలో జరగనున్న పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు ఈనెల 30లోపు చెల్లించాలని గుంటూరు డీఈవో సి.వి రేణుక తెలిపారు. 3 సబ్జెక్టులకు రూ.110, అంతకు మించితే రూ.125 చెల్లించాలన్నారు. మే 1 నుంచి పరీక్ష ముందు రోజు వరకు చెల్లిస్తే అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. రీకౌంటింగ్ ఒక్కో సబ్జెక్ట్‌కి రూ.500, రీ వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్ట్‌కి రూ.1,000లు మే 1లోపు చెల్లించాలన్నారు. 

News May 7, 2025

గుంటూరు జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

గుంటూరు కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి పింఛన్ పంపిణీ సిబ్బందికి ముఖ్య సూచనలు చేశారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన పంపిణీలో కొన్ని లోపాలు తేలినట్లు పేర్కొంటూ, వృద్ధులను గౌరవంతో చూడాలని, కులమతాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ నగదు ఇవ్వాలని ఆదేశించారు. అవినీతి, అమర్యాదలకు తావులేకుండా విధులు నిర్వహించాలని హెచ్చరించారు.