News February 24, 2025
చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదం.. 13 ఏళ్ల బాలుడు మృతి

చిలకలూరిపేట మండల పరిధిలోని గోపాళంవారిపాలెం పల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయ్ (13) అనే యువకుడు దుర్మరణం చెందాడు. గోపాళంవారిపాలెంకు చెందిన ముగ్గురు పిల్లలు పల్సర్ బైక్ పై వెళుతున్నారు. ఆర్టీసీ బస్ను క్రాస్ చేస్తూ, ఎదురుగా వస్తున్న ఎక్సల్ వాహనంను ఢీకొట్టారు. ప్రమాదంలో విజయ్ అక్కడికక్కడే చనిపోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 11, 2025
మంచిర్యాల: వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు: కలెక్టర్

వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం నస్పూర్లోని కలెక్టరేట్లో ‘అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం- 2025’ గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 12 నుంచి 19 వరకు వృద్ధుల వారోత్సవాలు కొనసాగుతాయన్నారు. పోషణ, ఇతర ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ నం.14567ను వృద్ధులు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
News November 11, 2025
శంబర పోలమాంబ అమ్మవారి జాతర తేదీలు ఖరారు

ఉత్తరాంధుల ఇలవేల్పు, గిరిజనుల ఆరాధ్య దేవత శ్రీశంబర పోలమాంబ అమ్మవారి 2025-26 జాతర తేదీలు ఖరారు అయ్యాయి. ఆలయ ఈవో బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. వచ్చే జనవరి 26వ తేదీన తోలేళ్ల ఉత్సవం, 27న సిరిమానోత్సవం, 28న అనుపోత్సవ కార్యక్రమం జరగనుంది. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఆలయ ఛైర్మన్, ఉపసర్పంచ్, మాజీ ఛైర్మన్లు, గ్రామ పెద్దలు, సేవకులు, ఆశాదిలు, తదితరులున్నారు.
News November 11, 2025
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 7రోజుల జైలు శిక్ష: SP

జామి పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం సేవించి స్కూటీ నడిపిన కొట్టాం గ్రామానికి చెందిన నక్కెళ్ల ఎర్రినాయుడుకు కోర్టు 7రోజులు జైలు శిక్ష విధించిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈనెల 9న విసినిగిరి జంక్షన్ వద్ద వాహన తనిఖీల సమయంలో మద్యం తాగి స్కూటీ నడిపిన నిందితుడిని జామి పోలీసులు పట్టుకున్నారు. సాక్ష్యాధారాలతో కోర్టులో హాజరుపరిచిన తరువాత శిక్ష ఖరారైందన్నారు.


