News April 9, 2025

చిలకలూరిపేట: విడదల రజిని బెయిల్‌పై తీర్పు రిజర్వ్

image

మాజీ మంత్రి విడదల రజిని హైకోర్టులో వేసిన ముందస్తు బెయిల్‌పై వాదనలు మంగళవారం ముగిశాయి. తీర్పుని హైకోర్టు రిజర్వ్ చేసింది. అప్పటి అడిగినంత సొమ్ము చెల్లించుకుంటే అంతు చూస్తామని, స్టోన్ క్రషర్‌ను మూసి వేయిస్తామని, క్వారీ యజమానులను బెదిరించారని, (ఏజీ) శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. పిటిషనర్‌లను కస్టడీలోకి తీసుకుని విచారించాలని ముందస్తు బెయిల్ పిటిషన్‌లు కొట్టి వేయాలని కోరారు.  

Similar News

News November 14, 2025

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న డయాబెటిస్ బాధితులు

image

ఖమ్మం జిల్లాలో డయాబెటిస్ బాధితులు సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. జిల్లాలో 13,35,202 జనాభా ఉన్నారు. వీరిలో మధుమేహం లక్షణాలు ఉన్నవారు 55,829, అధిక రక్తపోటు ఉన్నవారు 77,604 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1.30 లక్షల మందిని ఎన్సీడీ పోర్టల్‌లో నమోదు చేసి వారికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేల్లో జిల్లా మధుమేహ వ్యాప్తిలో 10వ జాబితాలో చేరింది. ‘నేడు వరల్డ్ డయాబెటిస్ డే’

News November 14, 2025

యాసంగి వరి సాగు.. ఆలస్యం వద్దు

image

TG: యాసంగిలో వరి నార్లు పోసుకోవడానికి డిసెంబర్ 20 వరకు అవకాశం ఉంది. నాట్లు ఆలస్యమైన కొద్దీ పంట దిగుబడులతో పాటు బియ్యం శాతం తగ్గి నూకశాతం పెరుగుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. యాసంగి సాగుకు జగిత్యాల రైస్-1, కూనారం సన్నాలు, R.S.R-29325, M.T.M-1010, తెల్లహంస, సన్నగింజ రకాలైన తెలంగాణ సోన, K.N.M-1638, K.N.M-733, W.G.L-962, జగిత్యాల సాంబ J.G.L-27356, R.N.R-21278 రకాలు అనుకూలం.

News November 14, 2025

తిలకధారణలో ఉన్న శాస్త్రీయత ఏంటి..?

image

స్త్రీలు కుంకుమ ధరించడం మన సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నం. వివాహిత స్త్రీకి ఇది గొప్ప మంగళసూచకం. నుదుటి మధ్యభాగం ఆజ్ఞాచక్రం కలిగిన కేంద్రం. ఈ కేంద్రం జ్ఞానశక్తికి, ఆలోచనా శక్తికి ముఖ్య ఆధారం. ఇక్కడ కుంకుమను ధరించడం ద్వారా స్త్రీ ‘నేను శక్తి స్వరూపిణిని’ అని ప్రకటిస్తుంది. ఇది ఆధ్యాత్మికంగా మనసును ఏకాగ్రం చేసి, మనలోని శక్తిని పెంచడానికి, శాశ్వత సౌభాగ్యాన్ని కాపాడటానికి తోడ్పడుతుంది. <<-se>>#Scienceinbelief<<>>