News December 14, 2024

చిలుకూరులో CM రేవంత్ రెడ్డి.. భారీ బందోబస్తు

image

చేవెళ్ల నియోజకవర్గంలో CM రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం చిలుకూరు గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, MLA కాలే యాదయ్య ఆయనకు స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను రేవంత్ రెడ్డి ఆసక్తిగా తిలకించారు. CM రాకతో మొయినాబాద్ మండల వ్యాప్తంగా, సభ వద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

Similar News

News November 25, 2025

సికింద్రాబాద్: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి త్వరగా వెళ్లాలంటే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలే శరణ్యం. ఇటీవల కాలంలో రైలులో కోచ్‌ల సంఖ్య సరిపోకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. చాలా మంది వీటి సంఖ్యను పెంచాలని అధికారులకు వినతిపత్రాలిచ్చారు. ఈ నేపథ్యంలో కోచ్‌ల సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 14 ఉన్న ఏసీ చైర్ కార్ కోచ్‌ల సంఖ్యను 16కు పెంచనున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.

News November 25, 2025

GHMC కౌన్సిల్ హాల్‌లో తగ్గేదే లే!

image

GHMC కీలక సమావేశానికి వేదికైంది. మరో 3 నెలల్లో పాలకవర్గం ముగియనుంది. మేయర్ అధ్యక్షతన నేడు జరిగే సర్వసభ్య సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, కొన్ని అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలపనుంది. చర్చల్లో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలని ప్రతిపక్షాలు, ధీటైన సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సభ్యులు కూడా తగ్గేదే లే అంటున్నారు.

News November 25, 2025

EXCLUSIVE: 15 ఏళ్ల తర్వాత తొలుగుతోన్న ముసుగులు

image

GHMCలో 15 ఏళ్లుగా ముసుగు కప్పుకున్న విగ్రహాల తెర వీడుతోంది. స్టాండింగ్ కమిటీ నుంచి ఆమోదం పొంది 5 నెలలు గడిచినా మధ్యలో పనులు ఆలస్యం అయ్యాయి. ప్రస్తుతం ప్రధాన కార్యాలయంలోనూ బ్యూటిఫికేషన్‌ పనులు పూర్తి చేశారు. విగ్రహాలను తరలించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు తుది దశకు చేరాయి. డిసెంబర్ మొదటి వారంలో మరోచోట విగ్రహాల ఆవిష్కరణ ఉంటుందని సమాచారం.