News March 25, 2025

చిలుకూరు స్కూలుకు కలెక్టర్, ఎస్పీ

image

చిలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ విద్యార్థుల ప్రార్థన సమయంలో సందర్శించారు. ఉగాదికి హుజూర్ నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్ల పరిశీలనకు వెళుతూ చిలుకూరులో ఆగారు. పదో తరగతి విద్యార్థులను పరీక్షలు ఏ విధంగా రాస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.

Similar News

News October 16, 2025

HYD: భారీగా వస్తాయనుకుంటే.. బోర్లా పడేశాయి!

image

భారీగా వస్తాయనుకున్న మద్యం షాపుల దరఖాస్తులు ఆబ్కారీశాఖలో ఆందోళన రేపాయి. గతేడాది ఉమ్మడి రంగారెడ్డిలో 514 మద్యం షాపులకు 38,493 దరఖాస్తులు రాగా.. 3రోజుల మిగిలి ఉండగా ఇప్పుడు కేవలం 3,173 వచ్చాయి. దీనికి వివిధ కారణాలు లేకపోలేదు. ఫీజు రూ.3లక్షలు చేయడం, రియల్ ఎస్టేట్ డమాల్ అనడం, స్థానిక ఎన్నికల ఆశావహులు ఖర్చు చేయకపోతుండటంతో దీనిపై ప్రభావం పడింది. గతేడాది దరఖాస్తుల ద్వారా రూ.769.86 కోట్ల ఆధాయం వచ్చింది.

నిర్మల్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక బస్సు

image

నిర్మల్ డిపో ఆర్టీసీ అధికారులు భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించారు. ఈనెల 27న మధ్యాహ్నం 1 గంటకు నిర్మల్ నుంచి ప్రయాగ్‌రాజ్ దేవాలయానికి ప్రత్యేక బస్సు నడపనున్నారు. ఈ యాత్రలో కాశీ, అయోధ్య దేవస్థానాల దర్శనం కూడా ఉంటుంది. ఒక్కరికి చార్జి రూ.6,399గా నిర్ణయించారు. టికెట్లను ఆర్టీసీ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలన్నారు. వివరాలకు 9959226003, 8328021517 నంబర్లను సంప్రదించాలన్నారు.