News November 11, 2024
చిల్పూర్: కుమారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్లో ఫిర్యాదు

తమ ముగ్గురు కొడుకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చిల్పూర్ మండలంలోని శ్రీపతిపల్లికి చెందిన చెట్టబోయిన వెంకట కిష్టయ్య, ఆయన భార్య సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. 30 గుంటల భూమి అమ్ముకోగా వచ్చిన రూ.26 లక్షల రూపాయలు ఇవ్వడం లేదన్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నా తమ గోడు పట్టించుకోవడం లేదని వాపోయారు. తమ ఫిర్యాదును స్వీకరించి తమ కొడుకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News November 6, 2025
వరంగల్ మార్కెట్ సందర్శించిన కలెక్టర్

వరంగల్ కలెక్టర్ డా. సత్యశారదా దేవి గురువారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ని సందర్శించారు. ఆమె మార్కెట్లోని రైతులు, వ్యాపారస్తులతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నవంబర్ 5తేదీలోపు తమ సమస్యల పరిష్కరించకపోతే పత్తి కొనుగోలు చేయమని వ్యాపారులు తెలిపిన నేపథ్యంలో వారితో మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేయాలని సూచించారు.
News November 5, 2025
ఎస్సీ విద్యార్థులకు గుడ్న్యూస్: రూ.3,500 స్కాలర్షిప్

జిల్లాలోని 9వ, 10వ తరగతి చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ తరఫున వారికి రూ.3,500 స్కాలర్షిప్ను మంజూరు చేయనున్నట్లు ఆ శాఖ అధికారి భాగ్యలక్ష్మి ప్రకటించారు. ఈ మేరకు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు తమ విద్యార్థుల వివరాలను https://telanganaepass.cgg.gov.in/ వెబ్సైట్లో తప్పక నమోదు చేయాలని ఆమె ఆదేశించారు.
News November 4, 2025
వరద నష్టం నివేదిక తక్షణమే ఇవ్వాలి: కలెక్టర్

జిల్లాలో భారీ వర్షాల వల్ల పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాలను తక్షణం నమోదు చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్లో వరదల ప్రభావం, పునరుద్ధరణపై ఆమె సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ముంపు సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.


