News June 14, 2024

చిల్లకూరు : కారును ఢీకొన్న లారీ

image

చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ సమీపంలోని కోల్డ్ స్టోరేజ్ వద్ద చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి గాయాలు కాగా.. వారిని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిల్లకూరు పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వివరాలు సేకరిస్తున్నారు.

Similar News

News March 1, 2026

నిఘా నీడలో నెల్లూరు: ఎస్పీ

image

జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల IPS ఆదేశాల మేరకు పోలీసులు సరికొత్త సాంకేతికతతో డ్రోన్ నిఘాను ముమ్మరం చేశారు. పట్టణ శివార్లు, నిర్మానుష్య ప్రాంతాలు, పాడుబడిన భవనాలు, తోటలపై డ్రోన్లతో నిరంతరం నిఘా ఉంచుతున్నామన్నారు. గంజాయి విక్రయాలు, బహిరంగంగా మద్యం తాగడం, పేకాట, ఈవ్ టీజింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News March 1, 2026

రేపు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం

image

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)ను ఈ సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్‌సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చన్నారు.

News March 1, 2026

నెల్లూరు: నో రిస్క్.. గెలిచిన వారినే కొంటాం.!

image

జిల్లాలో 722 పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి నాయకులు కొత్త పంథాను అవలంభిస్తున్నారట. గెలిచిన వారినే కోనేందుకు MLAలు సిద్ధమవుతున్నారట. అభ్యర్థులకు పార్టీ ఫండ్, వ్యక్తి గత డబ్బులు ఏమీ ఇవ్వమని నాయకులు తెగేసి చెబుతున్నారంట. దీంతో సర్పంచి, కార్పొరేటర్లు సొంత ఖర్చులు భరించాలంటే భారంగా మారుతోంది. స్థానిక ఎన్నికల్లో బలాబలాలు తేల్చుకోవడం సులువు కాకపోవడంతో MLAలు డబ్బు ఖర్చు చేసేందుకు జంకుతున్నారట.