News April 16, 2025
చివరి ఆయకట్టు వరకు నీరు సరఫరా చేయాలి: కలెక్టర్

కోనసీమ జిల్లాలో చిట్ట చివరి ఆయకట్టు వరకు పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జలవనరులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. రబీ సీజన్ పంట సాగుకు రైతులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సాగునీటిని అందించాలని ఆయన అధికారులకు సూచనలు చేశారు.
Similar News
News November 21, 2025
ఏపీ సచివాలయం వద్ద భద్రత పెంపు

AP: రాష్ట్రంలో మావో అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్, మరో 51 మంది మావోయిస్టులు అరెస్టయిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెలగపూడి సచివాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే ఉద్యోగుల ఐడీ కార్డులను పరిశీలించిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. విజయవాడ పరిసరాల్లో మరింత మంది మావోలు ఉండొచ్చనే సమాచారంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
News November 21, 2025
HYD: అటవీ సంపదను కొల్లగొట్టేందుకే మారణకాండ: CPI

అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు అడ్డంకిగా ఉన్న మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేరుతో కేంద్రం హత్య చేస్తుందని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. CPI ఆధ్వర్యంలో మఖ్ధూం భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. TPCC అధ్యక్షుడు మహేశ్గౌడ్ మాట్లాడుతూ.. జనజీవన స్రవంతిలో కలుస్తామని ముందుకు వచ్చే మావోయిస్టులను పట్టుకొని చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
News November 21, 2025
రాజీనామా యోచనలో కడియం..?

వరంగల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జూబ్లీహిల్స్ గెలుపు ఊపులో ఉన్న కాంగ్రెస్.. ఫిరాయింపుల విషయంలో రాజీనామా చేయించాలని చూస్తోంది. స్టే.ఘనపూర్ MLAగా ఉన్న కడియం శ్రీహరితో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లి BRSను ఇరుకున పెట్టడానికి CM రేవంత్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఇదే వేడిలో ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్కు గ్రౌండ్లో మరింత బలం పెరుగుతుందని భావిస్తున్నారు. 2 రోజుల్లో కడియం రాజీనామా చేసే అవకాశముంది.


