News January 25, 2025
చివ్వెంల: లింగమంతుల స్వామి జాతర ఏర్పాట్ల పరిశీలన

చివ్వెంలలోని దురాజ్‌పల్లి శ్రీ లింగమంతుల స్వామి జాతర సందర్భంగా శనివారం నిర్వహించిన దిష్టి పూజలో డీఎస్పీ రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతర జరిగే ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. DSP వెంట సూర్యపేట రూరల్ సీఐ జీ.రాజశేఖర్, సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ బీ.వీరరాఘవులు తుంగతుర్తి సీఐ, నాగారం సీఐ, ఎస్సై ఉన్నారు.
Similar News
News November 26, 2025
గద్వాల: జీపీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: ఈసీ

గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రిజర్వేషన్లు, విడతల వివరాలు, పోలింగ్ కేంద్రాల జియో లొకేషన్ వివరాలను టీఈ-పోల్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం నోడల్ ఆఫీసర్‌ను నియమించి, గ్రీవెన్స్ ప్లాట్‌ఫామ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
News November 26, 2025
సింహాచలం ఆలయ ప్రతిష్ఠ మసకబారింది: గంటా

గత వైసీపీ హయాంలో సింహాచలం దేవాలయాన్ని వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ఆలయాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తాలూకా అవశేషాలు దేవస్థానంలో ఇంకా ఉన్నాయన్నారు. ఉద్యోగ వ్యవహారాలు, విరాళాలు, బంగారు ఆభరణాల లెక్కలు.. ఇలా అనేక అంశాల్లో వస్తున్న ఆరోపణలు ఆలయ ప్రతిష్ఠను మసక బారుస్తున్నాయని అన్నారు.
News November 26, 2025
సర్పంచ్ ఎన్నికల కోసం మీడియా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా డిసెంబర్లో నిర్వహించే సర్పంచ్ ఎన్నికల కోసం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మీడియా కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్ఓ తిరుమల పాల్గొన్నారు.


