News December 16, 2024
చీడికాడలో యువకుడి ఆత్మహత్య

చీడికాడకు చెందిన వేచలపు మణికంఠ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ సతీశ్ చెప్పారు. మణికంఠ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని ఎవరో అవమానించడంతో ఈనెల 11న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
Similar News
News October 23, 2025
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ పలు అభివృద్ధి పనులకు ఆమోదం

జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ సమక్షంలో బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో 205 ప్రధాన అంశాలు, 12 టేబుల్ అజెండాలతో మొత్తం 217 అంశాలు పొందుపరిచారు. వాటిలో 4 అంశాలను వాయిదా వేసి 213 అంశాలకు ఆమోదం తెలిపారు. గాజువాక ప్రాంతానికి చెందిన స్నేక్ క్యాచర్ కిరణ్‌పై అవినీతి ఆరోపణలు వస్తున్నందున అతనిని విధుల నుంచి తొలగించాలని స్థాయి సంఘం సభ్యులు అధికారులకు సూచించారు.
News October 22, 2025
విశాఖ రైతు బజార్లలో డ్రా ద్వారా 129 మందికి స్టాల్స్ మంజూరు

విశాఖలోని రైతు బజార్లలో స్టాల్స్ కేటాయింపుల కోసం డ్రా నిర్వహించారు. దరఖాస్తు చేసిన వారిలో 129 మంది రైతులకు రైతు కార్డులు మంజూరు చేసినట్లు జేసీ మయూర్ అశోక్ తెలిపారు. డ్రా ప్రక్రియను కలెక్టరేట్లో అధికారులు, రైతుల సమక్షంలో నిర్వహించారు. ఎంపికైన వారికి త్వరలో రైతు బజార్లలో స్టాల్స్ కేటాయించనున్నారు.
News October 22, 2025
గవర్నర్‌కు స్వాగతం పలికిన జిల్లా అధికారులు

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ 2 రోజుల పర్యటన నిమిత్తం బుధవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి,ఇతర అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి పీఎంపాలెం వెళ్లారు.