News April 6, 2024
చీపురుపల్లిలో కాపులదే కీలక పాత్ర
చీపురుపల్లి నియోజకవర్గంలోని రాజకీయాలపై కాపు సామాజిక వర్గం పాత్ర కీలకం. దీనికి గల కారణం నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్యలో 80 శాతం ఈ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటమే. ఈ సమీకరణాలతో రెండు ప్రధాన పార్టీలు ఆ సామాజిక వర్గానికి చెందిన వారినే పోటీలో నిలిపాయి. YCP నుంచి బొత్స పోటీ చేస్తుండగా, TDP నుంచి కళా బరిలో నిలిచారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఈ వర్గం ఎవరివైపు మొగ్గుచూపుతుందనే ఉత్కంఠ నెలకొంది.
Similar News
News January 16, 2025
VZM:రహదారి నిబంధనలను పాటించాలి:కలెక్టర్
రహదారిపై ప్రయాణించేటప్పుడు ప్రతీఒక్కరూ నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోరారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను కలెక్టర్ తమ ఛాంబర్‌లో గురువారం ప్రారంభించారు. దీనికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్లే 90 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలను పాటించడం ద్వారా వీటిని నివారించవచ్చున్నారు.
News January 16, 2025
సీతానగరం: సువర్ణముఖి నదిలో పడి యువకుడి మృతి
సువర్ణముఖి నదిలో పడి యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వివరాల మేరకు పెదబోగిలి గ్రామానికి చెందిన ఎస్.అనుదీప్ (27) బంధువులతో కలిసి స్నానానికి వచ్చాడు. ఇసుక కోసం తవ్విన గోతిలో అనుదీప్ మునిగిపోవడంతో బంధువులు గుర్తించి బయటకు తీసి పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
News January 16, 2025
వేపాడ: ఎడ్ల పరుగు ప్రదర్శనలో అపశ్రుతి.. వ్యక్తి మృతి
వేపాడ మండలం కృష్ణరాయుడుపేటలో బుధవారం నిర్వహించిన ఎడ్ల పరుగు ప్రదర్శనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎడ్ల పరుగు ప్రదర్శనలో ఒక బండి అదుపు తప్పి కల్లాల వైపు వెళ్లింది. బి.దేముడు(48)పైకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్ఐ దేవికి చెప్పారు. మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.