News March 24, 2025

చీపురుపల్లి: అబ్బాయ్‌ను బాబాయ్ పక్కన పెడుతున్నారా..?

image

చీపురుపల్లి TDPలో కలహాలు తారస్థాయికి చేరుకున్నాయనే గుసగుసలు సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ప్రస్తుత MLA కళా వెంకట్రావుకు, TDP జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మధ్య పొసగడం లేదని టాక్. ఇటీవల TDP ఆఫీస్ ప్రారంభానికీ నాగార్జున రాకపోవడం ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది. రానున్న ఎన్నికల్లో తన కుమారుడు రామ్ మల్లిక్‌కు లైన్ క్లియర్ చేసేందుకు కళా యత్నిస్తున్నట్లు చర్చ నడుస్తోంది.

Similar News

News April 1, 2025

‘యువతిని చంపి 100 కి.మీలు బైక్‌పై తీసుకొచ్చారు’

image

సాలూరులో <<15956319>>యువతి హత్య<<>> కేసును పోలీసులు చేధించిన విషయం తెలిసిందే. యువతి మెడపై 2 గాయాలు ఉండడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. రాంబాబు ఐశ్యర్యను విశాఖ జిల్లా ఆరిలోవలోని ఓ రూములో చంపినట్లు తేలింది. అక్కడి నుంచి స్నేహితుల సాయంతో సాయంతో డెడ్‌బాడీని బైక్‌పై 100 KM తీసుకొచ్చి చెట్టుకు వేలాడదీశాడు. బైక్‌పై వచ్చినప్పుడు రికార్డ్ అయిన CC ఫుటీజీ ఆధారంగా రాంబాబును అరెస్ట్ చేశారు.

News April 1, 2025

యువతిని చంపి జీడితోటలో చెట్టుకు వేలాడదీశాడు

image

సాలూరు మండలం చీపురువలసలో జరిగిన యువతి హత్య కేసును పోలీసులు చేధించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మర్రివానివలసకు చెందిన ఐశ్వర్య విశాఖలో పనిచేస్తోంది. ఓ పెళ్లిలో దత్తివలసకు చెందిన వివాహితుడు రాంబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతడ్ని గుడ్డిగా ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవాలని అడగ్గా ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. ఈ క్రమంలో రాంబాబు యువతిని చంపి చెట్టుకు చున్నీతో వేలాడదీసి ఆత్మహత్యలా చిత్రీకరించాడు.

News April 1, 2025

భీమిలి బీచ్‌లో విజయనగరం వాసి మృతి

image

భీమిలి బీచ్‌లో విజయనగరం జిల్లా వాసి సోమవారం మృతి చెందారు. గజపతినగరం ప్రాంతానికి చెందిన పరదేశి(37) భీమిలీ బీచ్‌లో స్నానానికి వచ్చాడు. స్నానం చేసిన అనంతరం ఒడ్డుపై కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని భీమిలి ఆసుపత్రికి తరలించారు.

error: Content is protected !!