News January 28, 2025
చీపురుపల్లి ఎమ్మెల్యే కళా సోదరుడి మృతి

చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు కిమిడి సత్యనారాయణ నాయుడు(80) సోమవారం రాత్రి విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. నిన్న ఉదయం ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి 7 గంటల సమయంలో పరిస్థితి విషమించి మృతిచెందారు.
Similar News
News November 21, 2025
జోగులాంబ ఆలయంలో భక్తుల సామూహిక చండీ హోమాలు

అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తిపీఠమైన అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం దేవస్థానం అర్చకులు భక్తులతో సామూహిక చండీహోమాలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ చండీహోమాలు మధ్యాహ్నం 12:30 గంటలకు ముగిసింది. పూర్ణాహుతి సమర్పించి పరిసమాప్తి పలికారు. అనంతరం భక్తులకు యాగ రక్షని ప్రసాదంగా అందజేశారు.
News November 21, 2025
చిత్తూరు: భారీగా పెరిగిన కూరగాయల ధరలు

జిల్లాలో భారీగా పెరిగిన కూరగాయల ధరలతో పేద, మధ్య తరగతి వర్గాలకు ఇబ్బందులు తప్పడం లేదు. వరుసగా కురుస్తున్న వర్షాలతో పంట దిగుబడులు తగ్గి ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. పచ్చిమిరప రూ.40 నుంచి రూ.60కి, బీర రూ.40-రూ.60, వంకాయలు రూ.90-రూ.120 వరకు చేరుకున్నాయి. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News November 21, 2025
‘సెన్యార్’ తుఫాన్.. ఏపీకి వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీనికి ‘సెన్యార్’గా పేరు పెట్టారు. ఈ తుఫాను ప్రభావంతో ఈ నెల 26 నుంచి 29 వరకు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ప్రకాశం, NLR, CTR, TPT, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.


