News August 8, 2024

చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే మృతి

image

మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహన్‌రావు గురువారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోకి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చీపురుపల్లిలోని లావేరు రోడ్డు‌లోని ఆయన ఇంటికి మృతదేహాన్ని తీసుకురానున్నారు. కాగా ఏయూలో ఎంఏ పూర్తి చేసిన కెంబూరి..1985లో చీపురుపల్లి MLAగా, 1989లో బొబ్బిలి MPగా గెలిచారు.

Similar News

News September 8, 2024

పార్వతీపురం పురపాలక సంఘంలో కంట్రోల్ రూమ్

image

తుఫాను హెచ్చరికల దృశ్య పార్వతిపురం పురపాలక సంఘ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరుతున్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే తక్షణమే 08963221053 కంట్రోల్ రూమ్ నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.

News September 7, 2024

కొత్తవలస SI వెంకటేశులు మృతి

image

కొత్తవలస పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కె వెంకటేశులు శనివారం మధ్యాహ్నం ఇంటివద్ద మృతిచెందారు. ఆయన తనయుడి వివరాల ప్రకారం.. కొత్తవలసలో విధులు నిర్వహిస్తున్న కాలంలో మంచి గుర్తింపు పొందాడని, ఇదివరకు విశాఖ నగర పోలీస్ కంట్రోల్ రూంలో కూడా విధులు నిర్వహిస్తూ కొత్తవలస స్టేషన్‌కు బదిలీపై వచ్చారన్నారు. ఆయన అంత్యక్రియలు రేపు పాడేరులో నిర్వహిస్తామని వివరించారు.