News August 1, 2024

చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఉమ్మడి జిల్లా కలెక్టర్లు

image

ఆగస్టు 5 నుంచి 9 వరకు నిర్వహించే స్వచ్చధనం-పచ్చదనం కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి, జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.

Similar News

News November 27, 2024

సంక్షేమ హాస్టళ్లకు సన్న రకం బియ్యం అందిస్తాం: మంత్రి ఉత్తమ్

image

సంక్షేమ హాస్టళ్లకు, రెసిడెన్షియల్ పాఠశాలలు చౌక ధరల దుకాణాలకు సన్న రకం బియ్యం అందిస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. KNR జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. మొత్తం 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం అవసరం ఉంటుందని, ధాన్యం సేకరణ తక్కువ కాకుండా చూడాలని సూచించారు. సన్న రకాల వడ్ల కొనుగోళ్లపై ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు.

News November 27, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.2,32,941 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,09,814 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.81,660, అన్నదానం రూ.41,467 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News November 27, 2024

రాజన్న స్వామివారి హుండీ ఆదాయం వివరాలు ఇవే

image

వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి 32 రోజుల హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. రూ.1,50,24,507 వచ్చినట్లు ఈవో వినోద్ రెడ్డి బుధవారం పేర్కొన్నారు. బంగారం 170 గ్రాములు రాగావెండి 9 కిలోల 800 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. హుండీ లెక్కింపులో ఈవో వినోద్ రెడ్డి, ఏసీ కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఆలయ సిబ్బంది, శ్రీరాజరాజేశ్వర సేవాసమితి వారు పాల్గొన్నారు.