News June 20, 2024
చీమకుర్తిలో కిడ్నాప్ కలకలం

చీమకుర్తిలో కిడ్నాప్ కలకలం రేపింది. చీమకుర్తి సీఐ దుర్గా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పూర్ణ అనే యువకుడు బైక్‌పై బైపాస్ కూడలి ప్రాంతంలో వెళ్తుండగా.. ఎండ్లూరి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఆయనను వెంబడించి దాడి చేశాడు. మత్తు సూది ఇచ్చి కారులో హైదరాబాద్‌లోని మల్కాపూర్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ స్పృహలోకి వచ్చిన పూర్ణ తప్పించుకొని తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు సీఐ తెలిపారు.
Similar News
News February 26, 2026
మార్కాపురంలో సీఎంను ఆకట్టుకున్న విద్యార్థిని చిత్రలేఖనం

మార్కాపురం బహిరంగ సభలో ఓ విద్యార్థిని గీసిన చిత్రలేఖనం సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మార్కాపురం జిల్లా చెన్నకేశవ స్వామి గోపురం, సీఎం చిత్రాల అందంగా ఉండడంతో విద్యార్థినిని సీఎం అభినందించారు. ఈ చిత్రలేఖనంలో చాలా అర్థం దాగి ఉందని ప్రజలకు వివరించారు. ఆ దేవుడితో పెట్టుకుంటే పతనం ఖాయమని హెచ్చరించారు.
News February 26, 2026
వెలిగొండ పూర్తయితే 3 జిల్లాలకు ప్రయోజనం

కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు వెలిగొండ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. 43.5 TMCల వరద నీటిని నల్లమల్లసాగర్ రిజర్వాయర్ ద్వారా మళ్లించి 19.2 కిలోమీటర్ల పొడవైన టన్నెల్స్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించేలా రూపొందించారు. ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం వేగవంతం చేసి 2026కి పూర్తిచేస్తామని CM చంద్రబాబు పూనుకున్నారు.