News June 20, 2024

చీమకుర్తిలో కిడ్నాప్ కలకలం

image

చీమకుర్తిలో కిడ్నాప్ కలకలం రేపింది. చీమకుర్తి సీఐ దుర్గా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పూర్ణ అనే యువకుడు బైక్‌‌పై బైపాస్ కూడలి ప్రాంతంలో వెళ్తుండగా.. ఎండ్లూరి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఆయనను వెంబడించి దాడి చేశాడు. మత్తు సూది ఇచ్చి కారులో హైదరాబాద్‌లోని మల్కాపూర్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ స్పృహలోకి వచ్చిన పూర్ణ తప్పించుకొని తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు సీఐ తెలిపారు.

Similar News

News September 16, 2024

చీరాల వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్

image

చీరాల మండలం జాండ్రపేట వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేటపాలెం నుంచి చీరాలకు వెళ్తున్న బైక్ పాదచారుడిని ఢీకొని అదుపుతప్పి అటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జాండ్రపేట గుమస్తాలకాలనీకి చెందిన పాదచారుడు ఫణికుమార్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.

News September 16, 2024

చీరాల వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్

image

చీరాల మండలం జాండ్రపేట వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేటపాలెం నుంచి చీరాలకు వెళ్తున్న బైక్ పాదచారుడిని ఢీకొని అదుపుతప్పి అటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జాండ్రపేట గుమస్తాలకాలనీకి చెందిన పాదచారుడు ఫణికుమార్ (55) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.

News September 16, 2024

పెద్దారవీడు: కొట్లాట ఘటనపై ముమ్మర దర్యాప్తు

image

పెద్దారవీడు మండలం రాజంపల్లి పొలాల్లో <<14111250>>ఆదివారం కర్రల దాడి<<>>లో గాయపడిన బాధితులు మార్కాపురం వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. సత్యనారాయణ రెడ్డి, నరసింహారెడ్డి, అల్లూరెడ్డిలు కర్రలతో దాడికి దిగగా.. ఈ దాడిలో కంచర్ల చెన్నకేశవులు, కంచర్ల అంజమ్మ, చరణ్, రామాంజనేయులు, రాములమ్మతోపాటు మరొకరికి గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటన జిల్లా వ్యప్తంగా సంచలనం రేపగా పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.