News November 30, 2024
చీమకుర్తిలో కిడ్నాప్

ప్రకాశం జిల్లాలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం మడగడ గ్రామానికి చెందిన దినేశ్(16)ని కిడ్నాప్ చేశారు. ఈక్రమంలో అతడిని చీమకుర్తి గాంధీనగర్‌లో ఉంటున్న అరవింద్ అనే వ్యక్తి ఇంటికి కిడ్నాపర్లు తీసుకు వచ్చారు. దినేశ్ వారి నుంచి తప్పించుకుని చీమకుర్తి పోలీసులను ఆశ్రయించాడు. CI సుబ్బారావు కిడ్నాపర్లను వెంబడించి ఒకరిని పట్టుకోగా మరో ఇద్దరు పరారయ్యారు.
Similar News
News February 10, 2026
మార్కాపురం నుంచి శ్రీశైలానికి 80 RTC బస్సులు

శ్రీశైలం బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మార్కాపురం డిపో RTC బస్సులు ఏర్పాట్లు చేసింది. మార్కాపురం నుంచి శ్రీశైలానికి సోమవారం నుంచి 18వతేదీ వరకు 80 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య సోమవారం తెలిపారు. 14, 15,16 తేదీల్లో భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున ఆ రోజుల్లో కూడా మరికొన్ని సర్వీసులు కూడా నడిపేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని DM చెప్పారు.
News February 10, 2026
ప్రకాశం జిల్లా SP స్పందనకు 124 ఫిర్యాదులు

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 124 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు.. పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు వెంటనే ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.