News February 11, 2025

చీమకుర్తి: తండ్రిపై కొడుకు గొడ్డలితో దాడి

image

ప్రకాశం జిల్లాలో మంగళవారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చీమకుర్తి మండలం బండ్లమూడుకి చెందిన లక్ష్మారెడ్డిపై కొడుకే గొడ్డలితో దాడి చేసినట్లు సమాచారం. వెంటనే గ్రామస్థులు అడ్డుకొని 108 వాహనంలో క్షతగాత్రుణ్ణి ఒంగోలు హాస్పిటల్‌కు తరలించారు. తండ్రిపై దాడి చేసిన కుమారున్ని చీమకుర్తి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Similar News

News February 12, 2025

సంతనూతలపాడులో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

image

సంతనూతలపాడు మండలంలోని ఎం.వేములపాడు గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వేను కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం పరిశీలించారు. ఎంతమంది రీ సర్వే చేస్తున్నారని కలెక్టర్ అధికారులను ప్రశ్నించగా.. 5 టీములు భూముల రీ సర్వేలో పాల్గొంటున్నాయని వారు వివరించారు. వెంటనే రైతులకు ఫోన్ చేసిన కలెక్టర్ ఒక్క టీము మాత్రమే పాల్గొందని తెలుసుకొని 4 టీముల అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించినట్లు సామాచారం.

News February 12, 2025

ఒంగోలు: బెంగళూరుకు ఈవీఎంలు తరలింపు

image

ఒంగోలు నగరం మామిడిపాలెంలోని గోదాములో ఉన్న గత ఎన్నికలలో పనిచేయని వి.వి.ప్యాట్లు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను మంగళవారం బెంగళూరులోని బెల్ కంపెనీకి అధికారులు పంపించారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అధికారులు ఈ ప్రక్రియను నిర్వహించారు.

News February 12, 2025

ప్రకాశం: టెన్త్ అర్హతతో 118 ఉద్యోగాలు

image

మార్కాపురం డివిజన్‌‌లో 57, ప్రకాశం డివిజన్‌లో 61 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

error: Content is protected !!