News May 31, 2024

చీమకుర్తి: రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి

image

చీమకుర్తిలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ఇసుక వాగుకు చెందిన గుంటూరు రమేశ్ (43) పొదిలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తూర్పు బైపాస్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో సీఐ దుర్గాప్రసాద్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 30, 2024

బాలినేని తనయుడిపై సంచలన ఆరోపణలు

image

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ తనయుడు ప్రణీత్ రెడ్డిపై డాక్టర్ యాదాల అశోక్ సంచలన ఆరోపణలు చేశారు. ‘గత ఎన్నికల ముందు చినగంజాం MPP అంకమరెడ్డి నన్ను ప్రణీత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లారు. సంతనూతలపాడు టికెట్ కోసం ఫోన్‌పేలో రూ.10 లక్షలు, క్యాష్‌గా మరో 15 లక్షలు ఇచ్చా. టికెట్ రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరా. కులం పేరుతో నన్ను తిట్టారు’ అని అశోక్ ఒంగోలు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 30, 2024

చీమకుర్తిలో కిడ్నాప్ 

image

ప్రకాశం జిల్లాలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం మడగడ గ్రామానికి చెందిన దినేశ్(16)ని కిడ్నాప్ చేశారు. ఈక్రమంలో అతడిని చీమకుర్తి గాంధీనగర్‌లో ఉంటున్న అరవింద్ అనే వ్యక్తి ఇంటికి కిడ్నాపర్లు తీసుకు వచ్చారు. దినేశ్ వారి నుంచి తప్పించుకుని చీమకుర్తి పోలీసులను ఆశ్రయించాడు. CI సుబ్బారావు కిడ్నాపర్లను వెంబడించి ఒకరిని పట్టుకోగా మరో ఇద్దరు పరారయ్యారు.

News November 28, 2024

రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం రేపు ఉదయానికి తుఫానుగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం ఉదయం TN-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో 4రోజుల పాటు వర్షాలు కురుస్తాయంది. రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.