News February 21, 2025
చీరాలలో కొత్త తరహా మోసం

చీరాలలో గర్భిణిలకు, బిడ్డ తల్లులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.2లక్షలు వస్తాయని నమ్మబలికి, లింక్ పంపి మోసాలకు పాల్పడిన ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుషార్ డూడి శుక్రవారం తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఢిల్లీ కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన జిల్లా పోలీసులను అభినందించారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ జరుగుతోందని ఎస్పీ తెలిపారు.
Similar News
News December 9, 2025
ఈ మండలాల్లో ఎన్నికల ప్రచారం చేయవద్దు: సుర్యాపేట ఎస్పీ

సూర్యాపేట జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న సూర్యపేట, ఆత్మకూర్, మద్దిరాల, తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి ఈ మండలాలలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల సమయం ముగిసిందని ఎస్పీ నర్సింహ ఓ ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా చేరవద్దని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 9, 2025
సూర్యాపేట: ముగిసిన మొదటి విడత ఎన్నికల ప్రచారం

సూర్యాపేట జిల్లాలో గ్రామపంచాయతీ, వార్డు సభ్యుల ఎన్నికల మొదటి విడత ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసినప్పటి నుంచి బరిలో నిలిచిన వివిధ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొన్నారు. ఈనెల 11న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారంలో నిలబడిన అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
News December 9, 2025
మెదక్: సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా చుక్క రాములు

సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా చుక్క రాములు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మెదక్‌లో మూడు రోజులుగా జరిగిన రాష్ట్ర 5వ మహాసభల్లో ఈ మేరకు తీర్మానం చేశారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా పాలడుగు భాస్కర్, కోశాధికారిగా రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అనేక కార్మిక అంశాలపై తీర్మానాలు చేశారు. నూతన కార్యవర్గానికి మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం అభినందనలు తెలిపారు.


