News April 10, 2024
చీరాలలో త్రిముఖ పోరు.?

చీరాలలో రాజకీయం రోజురోజుకీ ఆసక్తిగా మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన YCP నుంచి కరణం వెంకటేశ్, TDP నుంచి కొండయ్య పోటీ పడుతుండగా ప్రచారం కూడా ముమ్మరం చేశారు. అయితే వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో చీరాలలో త్రిముఖ పోటీ తప్పదని ప్రజలు అంటున్నారు. ఇప్పటికే చీరాల నుంచి రెండు సార్లు గెలిచిన ఆమంచికి బలమైన కేడర్ ఉన్నా TDP, YCPపై గెలిచేనా?
Similar News
News March 24, 2025
KG చికెన్‌కు రూ.10టాక్స్.. ఇదేనా విజన్: తాటిపర్తి

యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మరోసారి వ్యంగ్యంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘విజన్ -2047 అంటే KG చికెన్‌కు రూ.10 L&P టాక్స్ కట్టడం. L&P టాక్స్ ఎలా అమలు చేయాలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్ట్ నడుస్తోంది. కావాలంటే తెలుసుకోండి. భవిష్యత్‌లో ప్రతి కేజీ చికెన్‌పై దోపిడీకి జేబులు సిద్ధం చేసుకోవాలని ప్రజలకు నా విన్నపం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
News March 24, 2025
ఒంగోలులో ESI ఆసుపత్రి స్థాపించాలి: మాగుంట

ఒంగోలులో ESI ఆసుపత్రిని స్థాపించాలని పార్లమెంట్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు. రూల్ నం. 377 క్రింద ఆసుపత్రి ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రకాశం జిల్లాలో 3003 కర్మాగారాలలో 86000 మంది ఉద్యోగ కార్మికులు ఉన్నారని, వారందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఈఎస్ఐ ఆసుపత్రి స్థాపించాలని మాగుంట కోరారు.
News March 24, 2025
ప్రకాశం: నేటి నుంచి ఇన్విజిలేటర్ల మార్పు

ప్రకాశం జిల్లాలోని 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లను మారుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 146 పరీక్ష కేంద్రాల్లో గణితం పరీక్ష నుంచి 1,300 మందిని జంబ్లింగ్ రూపంలో మార్చారు. గణితం పీఎస్, ఎన్ఎస్, సోషల్ స్టడీస్ పరీక్షలకు ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ పద్ధతిలో మార్చామని, వారు ఆయా కేంద్రాలలో విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.