News August 7, 2024
చీరాలలో యువకుడి దారుణ హత్య
బాపట్ల జిల్లా చీరాల ఆదినారాయణపురం వద్ద మంగళవారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సైకిల్ మీద వెళ్తున్న సయ్యద్ అరీఫ్ (18)ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఆరిఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సైకిల్ కారుకు సైడ్ ఇవ్వలేదనే విషయంలో వాగ్వాదం జరిగి.. ఆగ్రహించి కారు డ్రైవర్ కత్తితో దాడి చేసినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది.
Similar News
News September 13, 2024
ప్రకాశం: 108లో డ్రైవర్& పైలట్ ఉద్యోగాలు
104,108 వాహనాల్లో డ్రైవర్లు & పైలట్స్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బాపట్ల 104 జిల్లా మేనేజర్ జె నాగేశ్వరరావు తెలిపారు. డ్రైవర్& పైలట్ 10వ తరగతి ఉత్తీర్ణత, హెవీ లైసెన్స్, 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండి, ఇంగ్లిష్ చదవడం & రాయడం తెలిసి ఉండాలన్నారు. అర్హులైన వారు Sep 16వ తేదీలోపు చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో 104 కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
News September 13, 2024
బాపట్ల: ‘సర్వే పారదర్శకంగా నిర్వహించాలి’
వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులు దెబ్బతిన్న గృహాల సర్వే పారదర్శకంగా నిర్వహించాలని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. శుక్రవారం బాపట్ల కలెక్టరేట్ కార్యాలయం నుంచి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదకు బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు అధికంగా దెబ్బతిన్నాయన్నారు. 24 లంక గ్రామాలలో దెబ్బతిన్న గృహాల వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలన్నారు. నష్టం అంచనాలను స్పష్టంగా ఉండాలన్నారు.
News September 13, 2024
బాలినేని పార్టీ మార్పుపై మరోసారి చర్చ
మాజీ మంత్రి బాలినేని వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరతారనే వార్తలు మరోసారి చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వైసీపీ క్యాడర్‌లో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. మరోవైపు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కు అధిష్ఠానం నుంచి గురువారం పిలుపొచ్చింది. ఈ క్రమంలో ఆయనకు జిల్లా బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో బాలినేని నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.