News August 7, 2024

చీరాలలో యువకుడి దారుణ హత్య

image

బాపట్ల జిల్లా చీరాల ఆదినారాయణపురం వద్ద మంగళవారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సైకిల్ మీద వెళ్తున్న సయ్యద్ అరీఫ్ (18)ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఆరిఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సైకిల్ కారుకు సైడ్ ఇవ్వలేదనే విషయంలో వాగ్వాదం జరిగి.. ఆగ్రహించి కారు డ్రైవర్ కత్తితో దాడి చేసినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది.

Similar News

News September 19, 2024

ఎర్రగొండపాలెం MLA సమావేశం ఆంతర్యం ఏంటి?

image

ఎర్రగొండపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన ఇలా కార్యకర్తలతో సమావేశమవడం ఉత్కంఠ రేపుతోంది. కేవలం నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవడానికి ఇలా సమావేశం పెట్టారని కొందరు నేతలు చెబుతున్నారు.

News September 19, 2024

బాలినేని రాజీనామా.. వైవీ ఎంట్రీ

image

బాలినేని రాజీనామాతో ప్రకాశం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఆయనతో పాటు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ సైతం వైసీపీని వీడతారని అనుమానం రావడంతో జగన్ అప్రమత్తమయ్యారు. చంద్రశేఖర్‌ని తాడేపల్లికి పిలిపించుకుని మాట్లాడారు. మరోవైపు బాలినేని వెంట కీలక నాయకులు వెళ్లకుండా అడ్డుకోవడానికి మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. ఇప్పటికే పలువురితో ఫోన్‌లో మాట్లాడి బుజ్జగించినట్లు తెలుస్తోంది.

News September 19, 2024

ప్రకాశం జిల్లా విద్యార్థులకు గమనిక

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తు గడువును ఈనెల 24 వరకు పొడిగించినట్లు ప్రకాశం జిల్లా డీఈవో సుభద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 పరీక్ష ఫీజు కట్టాల్సి ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత వాటిని ప్రింట్ తీసుకుని ఈనెల 27వ తేదీలోగా డీఈవో కార్యాలయంలో సమర్పించాలన్నారు.