News April 19, 2024
చీరాల: అనుమానంతో భార్యపై భర్త దాడి
నిత్యం అనుమానంతో వాలంటీరును వేధిస్తూ.. గృహ హింస పెడుతున్న భర్తపై ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సునీత, వెంకటరావు భార్యాభర్తలు. సునీత వాలంటీరుగా పనిచేస్తుండగా.. వెంకటరావు మందుల దుకాణంలో పని చేస్తున్నారు. బుధవారం ఇంటికి వచ్చి భార్యపై భౌతిక దాడికి దిగాడు. గాయపడిన సునీత ఫిర్యాదు మేరకు వెంకటరావుపై గృహహింస కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News September 19, 2024
ఒంగోలు: కంప్యూటర్, ట్యాలీపై ఉచిత శిక్షణ
ఒంగోలు రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి కంప్యూటర్, ట్యాలీ నందు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 సంవత్సరాలు కలిగి ఉండి, గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ మహిళలకు ఈ అవకాశం ఉంటుందన్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలని, శిక్షణ సమయంలో శిక్షణతో పాటు భోజన, వసతి కల్పించనున్నట్లు వెల్లడించారు.
News September 19, 2024
నేను ఆ మాటలు అనలేదు: బాలినేని
ప్రతిపక్షంతో పాటు స్వపక్షంతోనూ తాను ఎన్నో బాధలు ఎదుర్కొన్నట్లు బాలినేని చెప్పారు. ‘సామాజికవర్గ న్యాయమంటూ నా పదవి పీకేశారు. ముందు ప్రకాశం జిల్లాలో ఎవరికీ మంత్రి పదవి లేదని.. చివరకు సురేశ్‌కు ఇచ్చారు. ఈడ్రామాలు అవసరమా? YSను తిట్టిన వాళ్లనూ మంత్రిగా కొనసాగించారు. పిల్ల కాంగ్రెస్, పెద్ద కాంగ్రెస్ కలిసిపోతోందని నేను చెప్పినట్లు నాపై దుష్ర్పచారం చేశారు. నేను ఆ మాటలు అనలేదు’ అని బాలినేని చెప్పారు.
News September 19, 2024
ఎర్రగొండపాలెం MLA సమావేశం ఆంతర్యం ఏంటి?
ఎర్రగొండపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన ఇలా కార్యకర్తలతో సమావేశమవడం ఉత్కంఠ రేపుతోంది. కేవలం నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవడానికి ఇలా సమావేశం పెట్టారని కొందరు నేతలు చెబుతున్నారు.