News July 8, 2024
చీరాల: ఆడపిల్లలు పుట్టారని.. ఇంటి నుంచి గెంటేశారు

చీరాల కొత్తపాలేనికి చెందిన మణికంఠరెడ్డి, కుసుమాంజలికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మొదటి సంతానంగా పాప పుట్టగా, కుసుమాంజలి గర్భవతిగా ఉన్న సమయంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందాడు. కుసుమాంజలికి రెండో కాన్పులో ఆడ కవలలకు జన్మనిచ్చింది. దీంతో అత్తా, మామ, మరిది ఇంట్లోకి రానివ్వలేదని అత్తింటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. కుసుమ బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 21, 2025
ప్రకాశం జిల్లా ‘పోలీస్ సింగం’ ఈయనే.!

నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఈ నేపథ్యంలో పలువురు పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిందే. ప్రకాశం జిల్లాకు చెందిన ఎందరో పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తూ అమరులయ్యారు. వారిలో ఒంగోలుకు చెందిన జాన్ వెస్లీ IPS ఒకరు. ఈయన YS రాజశేఖర్రెడ్డి భద్రతా అధికారిగా విధులు నిర్వహించారు. 2009లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో YSRతో సహా జాన్వెస్లీ విధినిర్వహణలోనే ప్రాణాలు విడిచారు.
News October 21, 2025
నేడు ఒంగోలులో అమరవీరుల దినోత్సవం.!

ఒంగోలులోని పోలీసు పరేడ్ గ్రౌండ్ వద్ద స్మృతి వనంలోని పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద మంగళవారం ఉదయం 7.30 గంటలకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నట్లు SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అమరవీరులకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో పోలీస్ అమరవీరుల త్యాగాలు అజరామరం అని పేర్కొన్నారు.
News October 20, 2025
నేడు ప్రకాశం జిల్లా SP కార్యక్రమం రద్దు

దీపావళి పండుగ సందర్భంగా సోమవారం (ప్రభుత్వ సెలవు దినం) కావడంతో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదులు చేసేందుకు వ్యయ ప్రయాసలుపడి జిల్లా పోలీసు కార్యాలయంకు సోమవారం రావద్దని ఎస్పీ సూచించారు.